"ధోనీ"నే టీమిండియా హెడ్ కోచ్ ?

VAMSI
ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అయిదు టెస్ట్ లలో భాగంగా ఇప్పటికే నాలుగు టెస్ట్ లు పూర్తి అయ్యాయి. సీరీస్ ను ఇండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఒక టెస్ట్ మాత్రం డ్రాగా ముగిసింది. ఆఖరి టెస్ట్ జరగాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే, ప్రస్తుతం క్రికెట్ అభిమానులలో టీ20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేసిన టీమ్ సభ్యులపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇంటర్నేషనల్ టీ 20 అనుభవం లేని వారిని కూడా ఈ వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కానీ దీనికి బీసీసీఐ సెలెక్టర్లు కూడా ఏవో కారణాలు చెబుతున్నారు. కానీ క్రికెట్ అభిమానులు మాత్రం సెలక్షన్స్ పై సంతోషంగా లేరని తెలుస్తోంది.
ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి మరియు ఇషాన్ కిషాన్ లను తీసుకోవడంపై గందరగోళం నెలకొంది. ఇంకో వైపు ఒకరి సెలక్షన్ మాత్రం ప్రేక్షకులను సంతోషానికి గురి చేస్తోంది. టైటిల్ ను గెలవడమే లక్ష్యంగా వరల్డ్ కప్ కు వెళుతున్న టీం ఇండియాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరు ఉండడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ధోని పేరు చూడగానే అందరూ ఏమిటి ధోని రిటైర్ అయ్యారు కదా? మళ్ళీ ఎలా అనే ఆలోచనలో పడ్డారట.. అయితే బీసీసీఐ క్లారిటీ ప్రకారం ధోని టీం కు మెంటార్ గా వ్యహరించనున్నట్లు తెలిపింది. అయితే ఇది విన్న ధోని అభిమానాలు ఆనంద డోలికల్లో తూలుతున్నారు.
ఇది తెలిసిన మరి కొంత మంది అభిమానులు ధోని కనుక మెంటార్ గా సక్సెస్ అయితే నెక్స్ట్ హెడ్ కోచ్ కూడా ఇతనే అవుతాడని ప్రచారం ఊపందుకుంది. మరి ఇది వినడానికి బాగానే ఉన్నా ఇలా జరిగే అవకాశం లేదంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. అయితే ముందు ముందు బీసీసీఐ ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుటునుందో తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: