సిరాజ్ పైనే భారత్ ఆశలు ?

VAMSI
ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్టు రసవత్తరంగా చివరి రోజు ఆట కొనసాగుతోంది. మొదటి సెషన్ లో భాగంగా గడిచిన 33 ఓవర్ల ఆటలో ఇరు జట్లు సమతూకంగా నిలిచాయి. అయితే ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. 77 పరుగులతో 5 వ రోజు ఆటను ప్రారంభించిన రారీ బర్న్స్ మరియు హసీబ్ హమీద్ ఆది నుండి నిలకడగా ఆడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే రారీ బర్న్స్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ తరువాత బంతికే శార్దూల్ థాకూర్ వేసిన అద్భుతమైన బంతికి కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగారు. బ్యాటు తో అధ్బుతంగా రాణించిన శార్దూల్ బంతితోనూ రాణించి ఇండియాకు మొదటి వికెట్ ను అందించాడు.
డేవిడ్ మలన్ తో జత కలిసిన హాసీబ్ హమీద్ నెమ్మదిగా ఇంగ్లండ్ ను ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దశలో హమీద్ కూడా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే జడేజా బౌలింగ్ లో హసిబ్ హమీద్ షాట్ ఆడబోయి సిరాజ్ కు ఇచ్చిన డైరెక్ట్ క్యాచ్ ను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ లైఫ్ తో బ్రతికిపోయిన హమీద్ చాలా జాగ్రత్తగా ఆడినా, డేవిడ్ మలన్ వచ్చినప్పటి నుండి క్రీజ్ లో ఇబ్బందిగానే కదులుతున్నాడు. హసీబ్ హమీద్ లేని పరుగుకు ప్రయత్నించి మలన్ అవుటవ్వడానికి కారణం అయ్యాడు. రెండవ వికెట్ కూడా కోల్పోయిన ఇంగ్లాండ్ ఇక పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. లంచ్ తర్వాత వేసిన రెండవ ఓవర్లోనే జడేజా హసీబ్ హమీద్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఇంకా గెలవాలంటే 222 పరుగులు చేయాల్సి ఉంది. అయితే గెలవడం దాదాపు కష్టమేనని తెలుస్తోంది.. అలాగని ఇండియా 7 వికెట్లు తీసి విజయాన్ని అందుకుంటుంది అని చెప్పలేము. నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ టెస్ట్ డ్రా గా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే ఇప్పటికే టెస్టులో ఇండియా ఎన్నో అద్భుతాలు చేసింది. ఓడిపోయే మ్యాచ్ లను సైతం గెలిచింది. ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వెళ్ళాలి. మరి సెకండ్ టెస్ట్ హీరో హైదరాబాద్ నవాబ్ మహమ్మద్ సిరాజ్ ఏమైనా అద్బుతం చేస్తాడా అన్నది చూడాలి.   రెండవ టెస్ట్ లోనూ గెలవడానికి చాన్స్ లేదనుకున్న సందర్భంలో అధ్బుతమైన బౌలింగ్ తో మ్యాచ్ స్థితినే మార్చేశాడు. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: