స్పోర్ట్స్ : కేవలం ఆ ఒక్క క్రికెటర్ కే సాధ్యమైన ఘనత..
క్రికెట్ లో ఎప్పుడు, ఎవరు ఎక్కువ పరుగులు తీస్తారన్నది అనేది మనం చెప్పలేదు. కానీ క్రికెట్ రంగంలో కొంతమంది మాత్రం డబుల్ సెంచరీలు చేసి రికార్డ్ సాధించిన రోజులు కూడా ఉన్నాయి. మరికొంతమంది క్రికెట్ మ్యాచ్ లో, ఓపెనింగ్ లేదా మిడిల్ ఆర్డర్ లో వచ్చి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడం సర్వసాధారణం. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక మ్యాచ్లో లోయర్ ఆర్డర్ లో వచ్చి 10 పదవ వికెట్ కు భారీ భాగస్వామ్యం అందించిన క్రికెట్ ప్లేయర్ ఎవరో చూద్దాం.
న్యూసౌత్ వెల్స్ తరఫున ఆడిన కిపాక్స్ .. ఆస్ట్రేలియా 22 వ టెస్టు లో ప్రాతినిధ్యం వహించాడు. మే 25 న 1897 న సిడ్నీలో జన్మించిన కిపాక్స్,1927-28 లో సిడ్నీలో న్యూజిలాండ్ లో జరిగిన మ్యాచ్లో 10వ వికెట్ కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంతవరకు ఆడిన క్రికెట్ చరిత్రలో ఈ వికెట్ కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం కావడం విశేషం.
కిపాక్స్, హల్ హుకర్ తో కలిసి ఐదు గంటలలో 307 పరుగులు జోడించాడు. ఇందులో కిపాక్స్ చేసిన పరుగులు 240. అతను ఆడిన అరవై ఒక్క షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లల్లో 70కి పైగా సగటుతో కిపాక్స్ 6096 పరుగులు చేశాడు.1972 లో సిడ్నీలో 75 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అలా కిపాక్స్ తన కెరియర్ లో మొత్తంలో 175 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అతని 57.22 సగటుతో, 12,762 పరుగులు చేశాడు. వీటిలో సెంచరీల సంఖ్య 43 కాక, 45 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు. అతని అత్యధిక స్కోర్ 315 చేయడంతోపాటు నాటౌట్ గా నిలిచాడు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాము అంటే మే -25 న కిపాక్స్ పుట్టిన రోజు కావడం విశేషం.