బర్త్ డే స్పెషల్: ఆ ఆటగాడు క్రీజ్ లో ఉంటే ఫ్యాన్స్ కు పండగే..!

Suma Kallamadi
నేడు పోలార్డ్ పుట్టిన రోజు. వెస్డిండిస్ జట్టు కెప్టెన్ కిరన్ పోలార్డ్ కు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులే ఉన్నారు. చాలా మంది ఇతర దేశ ఆటగాళ్లు ఐపిఎల్ ద్వారా ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. ఐపిఎల్ లో తమ పెర్ఫామెన్స్ ను అదరగొడుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఐపిఎల్ ద్వారానే పోలార్డ్ కూడా క్రేజ్ సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. ఐపీఎల్ లో ఫుల్ ఎంటర్ టైయిన్మెంట్ ఇవ్వడంలో కిరన్ పోలార్డ్ ముందుంటాడు. వెస్టిండీస్కు చెందిన పోలార్డ్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న విషయం తెలిసిందే. పోలార్డ్ క్రీజ్ లో ఉన్నాడంటే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు పండగే. అతడు కొట్టే సిక్సర్లు బౌండరీలతో ప్రేక్షకులను ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు. ఐపీఎల్ లో అత్యధిక స్ట్రయిక్ రేట్తో ఆడుతున్న బ్యాట్స్ మెన్లలో పోలార్డ్ కూడా ఒకడు. క్రిస్ గేల్ ఏబీ డివిలియర్స్ కిరన్ పోలార్డ్ క్రీజ్ లో లాంటి బ్యాట్స్మెన్లు క్రీజులో ఉంటే స్కోరు బోర్డు పరుగులు పెడుతూ ఉంటుంది. ప్రత్యర్థులకు చమటలు పడుతూ ఉంటాయి.
ఈ సారి ఐపిఎల్ లో ముంబై ప్లేయర్ కీరన్‌ పోలార్డ్‌ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఒకే టీమ్ తరపున 150 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ టీ20 లీగ్‌ ప్రారంభమైన నాటి నుంచి పోలార్డ్‌ ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ టీమ్ సాధించిన చాలా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. చాలామంది జట్టులో ప్లేస్ కోసం ఆశగా చూసే ఐపీఎల్ లో ఒకే జట్టుకు సేవలు అందిస్తూ రాణించటంపై ముంబై కెప్టెన్‌ రోహిత్‌.. పోలార్డ్‌ను ప్రశసించాడు. 2013, 2019లో ఫైనల్‌ మ్యాచుల్లో ముంబై విజయం  సాధించడానికి ప్రధాన కారణం పోలార్డ్‌ అని గుర్తు చేసుకున్నాడు. ఈ జట్టులోని మరో ప్లేయర్ హార్దిక్‌ పాండ్యా సైతం పోలార్డ్‌ను ప్రశంసించాడు.  ఈ టీ20 ఈవెంట్లో ఇప్పటి వరకూ 150 మ్యాచ్‌లు ఒకే టీమ్ తరపున ఆడిన ఆటగాళ్లలో కీరన్‌ పోలార్డ్ టాప్‌-5లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: