పిచ్ కాదు.. మేమే విఫలం అయ్యాం.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు..?
ఇలాంటి క్రమంలోనే ఇక ఐపీఎల్లో దిగ్గజ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు నిన్న జరిగిన మ్యాచ్లో విజయం సాధిస్తుంది అని ప్రేక్షకులందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ పొట్టి ఫార్మాట్ క్రికెట్ అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా ఊహకందని విధంగా ఉంటుంది నిన్న జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది. ప్రేక్షకులందరూ ముంబై ఇండియన్స్ గెలుస్తుందని నమ్మకంతో ఉంటే అక్కడ సీన్ మాత్రం తారుమారైంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు మొదటినుంచి తడబడుతూనే ఆడింది. దీంతో అతి తక్కువ పరుగులకే పరిమితం కావలసి వచ్చింది. తక్కువ పరుగులు చేసినప్పటికీ రోహిత్ శర్మ తన కెప్టెన్సీని నైపుణ్యంతో ఈ పరుగుల తోనే విజయం సాధిస్తాడు అని అందరు అనుకున్నారు.
కానీ పంజాబ్ బ్యాట్మెన్ ల సునామీ ముందు ముంబై ఇండియన్స్ కొట్టుకుపోయింది అనే చెప్పాలి. ముఖ్యంగా గేల్ అద్భుతంగా రాణించాడు ఇక కేఎల్ రాహుల్ కూడా ఎంతో అద్భుతంగా రాణించి భారీ పరుగులు చేశాడు. కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఇక భారీ విజయాన్ని సాధించింది పంజాబ్ కింగ్స్ జట్టు. అయితే ఓటమి పై మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ బ్యాటింగ్ లైనప్ లో ఎక్కడో లోపం ఉంది కంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పంజాబ్ జట్టు పై 160 పరుగుల వరకు చేసి ఉంటే బాగుండేది అంటూ తెలిపాడు. పిచ్ సమస్య ఏమీ లేదని తమ జట్టు పూర్తిగా విఫలం అయింది అంటూ చెప్పుకొచ్చాడు.