ఐపీఎల్ 2021 : ధోని గెలుస్తాడా.. ధోని వారసుడు నిలుస్తాడా..?
ఎంతో హోరాహోరీగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో చివరికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. అయితే మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో బ్యాటింగ్ విభాగం బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. ఇకపోతే నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ పై కూడా ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ వైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు.
మరోవైపు ధోని వారసుడిగా భారత క్రికెట్ లో పేరు తెచ్చుకున్న రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కి సారధి గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ రెండు జట్లలో హాట్ ఫేవరేట్గా చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నప్పటికీ ఇక ధోని వారసుడు గా పేరు తెచ్చుకున్న రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఎలా రాణించ బోతున్నాడు అన్నది కూడా ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ధోనీ గెలుస్తాడా లేదా ధోని వారసుడు గెలిచి నిలుస్తాడా అన్నది ప్రస్తుతం మరింత అంచనాలు పెంచేసింది. దీంతో ఈ మ్యాచ్ కోసం అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.