కోహ్లీ విషయంలో ఎప్పటికీ అలా అనుకోను..?
ఇక ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయంతో ఆత్మ విశ్వాసంతో ఉన్న టీమిండియా ఇటీవలే ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఘోర ఓటమి చవి చూడటంతో కోహ్లీ కెప్టెన్సీ పై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై వ్యూహాలపై విమర్శలు గుప్పిస్తున్న వేళ ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ కోహ్లీకి అండగా నిలిచాడు. ఇటీవలే ఓ క్రీడా వెబ్ సైట్ తో మాట్లాడిన పీటర్సన్.. పరిస్థితులు అలా మారాలి అని కోరుకోను కాని టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్సీ చుట్టూ జరిగే చర్చను విస్మరించడం అసాధ్యం అంటూ చెప్పుకొచ్చాడు పీటర్సన్.
వరుసగా నాలుగు టెస్టులు ఓటమితో విరాట్ కోహ్లీ సారథ్యం విమర్శలు ఎదుర్కొంటోంది ఇక వరుసగా మూడుసార్లు విజయం సాధించి అజింక్య రహానే కెప్టెన్సీ చారిత్రాత్మక విజయం సాధించి ప్రశంసలు అందుకుంటున్న వేళ ప్రస్తుతం కెప్టెన్సీ మార్పుపై సామాజిక మాధ్యమాలు టీవీ రేడియో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. భారత జట్టుకు కెప్టెన్సీ చేయడం చాలా కష్టమని దురదృష్టం కొద్దీ అప్పుడప్పుడు ఇలాంటివి చోటుచేసుకుంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోహ్లీకి మరో ఓటమి అవసరం లేదని.. టీం ఇండియాకు విజయం అందించే సత్తా కోహ్లీకి ఉంది అంటూ పీటర్సన్ చెప్పుకొచ్చాడు.