హార్థిక్ పాండ్య ఆటపై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..?
ఇక ఇటీవల భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ ఆడిన మొదటి వన్డేలో కూడా హార్థిక్ పాండ్య ఇరగదీశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రీజులోకి వచ్చిన హార్థిక్ పాండ్య మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత జట్టు ఒక గౌరవప్రదమైన స్కోరు నిలిపాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లు అందరూ వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టీమిండియాను హార్థిక్ పాండ్య ఆదుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా మెరుపు ఇన్నింగ్స్ ఆడి 90 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు హార్దిక్ పాండ్య. హార్థిక్ పాండ్యా గ్రౌండ్ లోకి వచ్చినప్పుడు నుంచి స్కోరుబోర్డు పరుగులు పెడుతూనే ఉంది.
ఇటీవలే మొదటి వన్డేలో అదరగొట్టిన హార్థిక్ పాండ్య పై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియాతో తలపడిన తొలి వన్డేలో పాండ్య 90 పరుగులు చేసి తృటిలో శతకం కోల్పోయిన విషయం తెలిసిందే. హార్థిక్ పాండ్యా క్రీజ్లో ఉన్నంత సేపు భారత్ ఆశలు సజీవంగా ఉంచాడు అంటూ పేర్కొన్నాడు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య పూర్తిస్థాయి బ్యాట్మెన్గా ఆడుతున్నాడని ముందు ముందు ఇలాగే బ్యాటింగ్ చేస్తాడు అని కొనియాడాడు . హార్థిక్ పాండ్య 4, 5 స్థానాల్లో మారిస్తే బాగుంటుందని న అభిప్రాయం వ్యక్తం చేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతంగా ఆడుతున్నాడు అంటూ ప్రశ్నలు కురిపించారు ఆకాష్ చోప్రా .