బుట్టబొమ్మ పాటపై వార్నర్ మరోసారి ఇరగదీసాడు.. వైరల్ వీడియో..!

praveen
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లాక్డౌన్ సమయంలో తెలుగు ప్రజలందరికీ సూపర్ స్టార్ గా మారిపోయాడు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అయినప్పటికీ తెలుగు ప్రజల్లో ఒకడిగా  మారిపోయాడు.  సామాజిక మాధ్యమం ద్వారా తెలుగు ప్రజలందరికీ దగ్గరైన డేవిడ్ వార్నర్... మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తూ  మరింత దగ్గరవుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గతంలో టిక్ టాక్ ద్వారా ఎన్నో వీడియోలు పై డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు డేవిడ్ వార్నర్.

 లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం కావడంతో లాక్ డౌన్ సమయం లో కూడా ప్రేక్షకులను అలరించడానికి సామాజిక మాధ్యమం టిక్టాక్ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ముఖ్యంగా తెలుగు హీరోల సినిమాల పాటల పై డాన్స్ పర్ఫార్మెన్స్ లో చేస్తూ తెలుగు ప్రజలందరికీ ఉర్రూతలూగించాడు డేవిడ్ వార్నర్. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠ పురం లో సినిమాలోని బుట్ట బొమ్మ పాట పై గతంలో డేవిడ్ వార్నర్ చేసిన డాన్స్ ఎంతలా వైరల్ అయి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే ప్రస్తుతం మరోసారి బుట్ట బొమ్మ పాట తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు డేవిడ్ వార్నర్.

 ప్రస్తుతం సన్రైజర్స్ జట్టుకు సారథిగా ఎంతో విజయవంతంగా జట్టును ముందుకు తీసుకెళుతున్న విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాడు డేవిడ్ వార్నర్ ఇటీవలే ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కాస్త సమయం దొరకడంతో తెలుగు పాటలు వింటూనే విశ్రాంతి తీసుకుంటున్నాడు డేవిడ్ వార్నర్ ఈ క్రమంలోనే కూర్చుని బుట్ట బొమ్మ సాంగ్ పై మరోసారి స్టెప్పులు వేసి అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇది చూసి అభిమానులు అందరూ మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: