ముంబై జట్టు... మరోసారి ఆ విషయాన్ని నిరూపించింది..?
దీంతో ఈసారి కూడా అందరూ అనుకున్న విధంగానే అంచనాలకు తగ్గట్టుగా ఆడుతుంది ముంబై ఇండియన్స్ జట్టు. ప్రస్తుతం ప్రతి మ్యాచ్లో కూడా విజయం సాధిస్తూ దూసుకుపోతుంది. ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి దిగ్గజ జట్టు అని నిరూపించుకున్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఐపీఎల్ లో నాలుగు సార్లు టైటిల్ సాధించిన దిగ్గజ జట్టు ఎలా ఆడాలో అలాగే ఆడి చూపించి సత్తా చాటింది ముంబై ఇండియన్స్ జట్టు. ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ జట్లుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించి కేవలం 5 ఓవర్ల వ్యవధిలోనే ఏకంగా కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో అసలు చెన్నై ఎక్కువ స్కోర్ చేయగలుగుతుందా అభిమానులను నిరాశ పడి పోయారు. పవర్ ప్లే ముగియకముందే దాదాపు ఐదు వికెట్లు పడిపోవడంతో ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పని అయిపోయింది అని అభిమానులు భావించారు. ఇక ఆ తర్వాత పడుతూ లేస్తూ 115 పరుగులు చేసింది చెన్నై జట్టు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు పది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి చేరుకుంది. ఇక మరో సారి తాము దిగ్గజ టు అని నిరూపించింది.