గబ్బర్ గర్జించాడు... అరుదైన రికార్డు సొంతం..?
ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్లో విజయం తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుసగా ఏకంగా మూడు విజయాలను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఢిల్లీ కాపిటల్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుతంగా రాణిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు శిఖర్ ధావన్. ముఖ్యంగా వరుసగా రెండు మ్యాచ్లలో కూడా సెంచరీతో చెలరేగిన శిఖర్ ధావన్ అదరగొట్టారు అని చెప్పాలి. భారీ సిక్సర్లతో హోరెత్తించారు శిఖర్ ధావన్.
ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా అద్భుతంగా సెంచరీ సాధించిన శిఖర్ ధావన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లి 5 వేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్ చేరిపోయాడు. ఐపీఎల్లో ఐదు వేల పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఇప్పటికే విరాట్ కోహ్లీ.. సురేష్ రైనా రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్ లు ఉండగా ఇప్పుడు శిఖర్ ధావన్ కూడా చేరిపోయాడు. అంతేకాదు ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు శిఖర్ ధావన్.