ఓడిపోయాం సరే.. ధోని నువ్వేంటి అలా ఆడావ్..?
ఇక మహేంద్రసింగ్ ధోని కి బౌలింగ్ చేసే బౌలర్ల వెన్నులో వణుకు పుట్టేది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం అలాంటి మెరుపులు ఎక్కడా కనిపించడం లేదు. నిన్న జరిగిన మ్యాచ్ ఇందుకు నిదర్శనంగా మారిపోయింది. క్రీజులో క్రికెట్ దిగ్గజం బెస్ట్ ఫినిషర్ ఎంఎస్ ధోని ఉన్నాడు. చేయాల్సిన పరుగులు 23 మాత్రమే. ఇక తొలి రెండు బంతుల్లో ఆరు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత నాలుగు బంతుల్లో 17పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. ధోనీ ఫినిషింగ్ రికార్డులు చూస్తే ఇదేమీ పెద్ద కష్టం కాదు అని అనుకుంటారు ఎవరైనా. కానీ ఎవరూ ఊహించని విధంగా పరుగుల చేదనలో బెస్ట్ ఫినిషర్ గా పేరున్న ధోనీ విఫలం అయ్యాడు.
దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే.. ధోని కి బౌలింగ్ చేసింది అసలు అనుభవమే లేని ఆటగాడు. అంతకుముందు దిగ్గజ బౌలర్లను సైతం బెంబేలెత్తించి భారీ స్కోరును సైతం ఛేదించి ఎన్నోసార్లు జట్టుకు విజయాన్ని అందించాడు ధోని. కానీ చివరికి అనుభవం లేని బౌలర్ బౌలింగ్ చేసినప్పటికీ కూడా తక్కువ పరుగులను కూడా చేధించలేక పోయాడు. దీంతో మ్యాచ్ ఓడిపోయాము అనేదానికంటే... ధోని ఆటతీరు పైనే ఎక్కువగా నిరాశతో ఉన్నారు చెన్నై అభిమానులు. దీన్ని బట్టి చూస్తే అసలు ధోనీ బెస్ట్ ఫినిషర్ గా కనిపించడం కష్టమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.