నా కెప్టెన్సీ స్కిల్స్ కి అతడే కారణం.. ఎట్టకేలకు ఒప్పుకున్న రోహిత్ శర్మ.?

praveen
టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా ఉన్న రోహిత్ శర్మ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది అన్న విషయం తెలిసిందే. అందరూ ఆటగాళ్లలా కాకుండా తనదైన భిన్నమైన శైలిలో... మైదానం లో అద్భుతం గా రాణిస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. కేవలం రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు కెప్టెన్సీలో కూడా ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉంటాడు. ముఖ్యం గా రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఎంతగానో  మెచ్యూరిటీ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఆటగాడిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని తనదైన వ్యూహాలతో  మ్యాచ్ ని  విజయతీరాలకు చేరుస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. ఇప్పటికే ఇలాగే పలుమార్లు టీం ఇండియా కెప్టెన్ గా వ్యవహరించి మంచి విజయాలను కూడా అందించాడు.


 అంతేకాదు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా  ఎంతో విజయవంతమైన సారధిగా  ప్రస్తుతం కొనసాగుతున్నాడు  రోహిత్ శర్మ. అందుకే రోహిత్ శర్మ కెప్టెన్సీ అంటే ఎంతోమంది తెగ ఇష్టపడుతూ ఉంటారు. మ్యాచ్ లో  ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఎంతో కూల్ గా కనిపిస్తూ ఉంటాడు రోహిత్. అయితే తనలో  ఇలా కెప్టెన్సీ లక్షణాలు మెరుగు పడడానికి కారణం ఎవరు అనేదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రోహిత్ శర్మ.

తన  కెప్టెన్సీ నైపుణ్యత  ఎంతగానో మెరుగుపడటానికి కారణం రికీ పాంటింగ్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక ఆటగాడి నుంచి మెరుగైన ప్రదర్శన ఎలా రాబట్టాలి అనే విషయాలను రికీ పాంటింగ్ దగ్గరి నుండే  నేర్చుకున్నాను అంటూ తెలిపారు రోహిత్ శర్మ. ప్రతి ఒక్కరి నుంచి సలహాలు తీసుకుని వాటన్నింటినీ ఫిల్టర్ చేసి... సరైన నిర్ణయం తీసుకోవాలని పాంటింగ్ ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు అంటూ గుర్తు చేసుకున్నాడు. అందుకే ఇప్పటికి కూడా జట్టు సభ్యులతో పాటు రిజర్వుడు ఆటగాళ్ల  నుంచి కూడా ఎన్నో సలహాలు స్వీకరిస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: