విశాఖలో వెస్టిండీస్ జట్టు కి భారీ టార్గెట్ ఫిక్స్ చేసిన భారత్..!!

KSK

విశాఖపట్టణం వేదికగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ భారత్ మొదటిగా బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చింది. దీంతో భారత బ్యాటింగ్ ఓపెనర్లు ఓపెనర్లు గ్రౌండ్ లోకి అడుగుపెట్టి మొదటి ఓవర్ నుండి దాదాపు 40 ఓవర్లు దగ్గర వరకు ఇద్దరు విండీస్ బౌలర్లతో చెడుగుడు ఆడేసుకున్నారు. ఓపెనర్లు లోకేష్ రాహుల్ మరియు రోహిత్ శర్మ ఇద్దరు సెంచరీలు నమోదు చేసుకున్నారు. ఇద్దరూ ఫోర్లు సిక్సర్లతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టించారు. విశాఖపట్టణం వాసులు వీరిద్దరి బ్యాటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌కు ఐదు వికెట్లను కోల్పోయి విండీస్‌కు 388 ప‌రుగులు భారీ ల‌క్ష్యాన్ని ఇచ్చింది. రోహిత్ శ‌ర్మ (138 బంతుల్లో 159 ప‌రుగులు 17ఫోర్లు, 5సిక్స్‌లు ఔట్‌), కెఎల్ రాహుల్ (104 బంతుల్లో 102 ప‌రుగులు 8ఫోర్లు, 3 సిక్స్‌లు ఔట్‌), శ్రేయ‌స్ అయ్య‌ర్ (32 బంతుల్లో 53 ప‌రుగులు, 3 ఫోర్లు,4 సిక్స్‌లు ఔట్‌), విరాట్ కోహ్లి (0-ఔట్‌), రిష‌బ్ పంత్ (16 బంతుల్లో 39 ప‌రుగులు, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఔట్‌) కేదార్ జాద‌వ్ (16 ప‌రుగులు) చేశారు.

 

మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి రేస్ లో ముందు ఉన్న వెస్టిండీస్ తాజాగా విశాఖపట్నంలో జరగనున్న మ్యాచ్ లో విన్ అయి సిరీస్ కైవసం చేసుకునే ఆలోచనలో ఉంది. మరొక పక్క భారత్ క్రికెట్ టీం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్లో సమం చేసే ఆలోచనలో ఉన్నారు. మరియు అదే విధంగా విశాఖపట్నం వైఎస్ఆర్ స్టేడియంలో మైదానం ట్రాక్ రికార్డు బట్టి చూస్తే భారత్ కి చాలా ఫేవరెట్ గా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

 

ఇప్పటివరకు భారత క్రికెట్ టీం ఈ గ్రౌండ్లో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్ లో ఆరు విజయం సాధించగా 1 వర్షం పడటం వల్ల ఆగిపోవడంతో రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్లో భారత్ ఎక్కువ విన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: