నువ్వు నీలానే ఆడు...పంత్ కి గిల్ క్రిస్ట్ సలహా

Pranateja Sriram
భారత క్రికెట్ టీంలో వికెట్ కీపర్ గా ధోని స్థానాన్ని అందుకున్న యువ ఆటగాడు రిషబ్ పంత్. ధోనీ తర్వాత ధోనీలా ఆడతాడని ఆ స్థానానికి అతనే సరైన వాడని ఏరి కోరి మరీ రిషబ్ పంత్ ని వికెట్ కీపర్ గా సెలెక్ట్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనతో చతికిలపడుతున్నాడు. దీనివల్ల అతడు తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. భారత ప్రధాన కొచ్ రవిశాస్త్రి సైతం అతని ఆటతీరు మార్చుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో కష్టం అవుతుందని చెప్పాడు. 


ఇంకా ఇతర ఆటగాళ్ళు కూడా అతని ఆట మీద కంప్లైంత్స్ చేశారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ పంత్ కి తన సలహానిచ్చాడు. గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ, అభిమానులు అతనిపై అనవసరంగా ఒత్తిడి పెంచకండి. పంత్ మంచి ఆటగాడు. మంచి వికెట్ కీపర్ కూడా.. అతని ధోనితో పోల్చి చూడటం సరికాదు. ధోనీ వరల్డ్ క్లాస్ ప్లేయర్. అతను సాధించిన విజయాలు చాలా పెద్దవి. వాటిని అందుకోవాలంటే చాలా సమయం పడుతుంది. 


ధోనీలా పంత్ ఆడాలనుకోవడం కరెక్ట్ కాదు. పంత్ కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయింది.  కెరియర్ స్టార్టింగ్ లో ఉన్న పంత్ ని ధోనీలా చూడడం వల్ల అతనిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీనివల్ల అతడి ఆట దెబ్బతిని, అతని క్రికెట్ కెరీర్ నాశనమవుతుందని చెప్పాడు. ఇంకా, ధోనీ వికెట్ కీపర్ గా ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేశాడని. ఆ మార్క్ ని ఎవరో ఎప్పుడో ఒకప్పుడు దాటుతారని చెప్పాడు. నా మటుకు నేను పంత్ లా ఆడే పంత్ ని చూడాలనుకుంటున్నానని, పంత్ మంచి తెలివైన ఆటగాడని, అతని ఆట అతన్ని ఆడనివ్వమని కోరాడు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: