“కోహ్లీ” సేన ఘన విజయం..”సెంచరీ చేసిన కోహ్లీ”

Bhavannarayana Nch

కోహ్లీ సేన ఘనవిజయం..విమర్శకుల నోళ్ళు మూయిస్తూ భారత జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సీరీస్ ని కైవశం చేసుకుంది..కోహ్లీ తన సెంచరీతో భరత్ కి గెలుపు బాట వేశాడు..డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ కోహ్లి (112: 119 బంతుల్లో 10x4) శతకం బాదడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది..సఫారీలను ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో..బంతులని చీల్చి చెండాడే పద్దతిలో మాత్రం కోహ్లీ తనదైన ఆట ప్రదర్శించాడు..

 

కోహ్లి- అజింక్య రహానె (79: 86 బంతుల్లో ) జోడి మూడో వికెట్‌కి 189 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 270 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 4 ఓవర్ల 3 బంతులు ఉండగానే ముగించేసింది..ఓపెనర్ రోహిత్ శర్మ (20), శిఖర్ ధావన్ (35) సఫారీ పర్యటనలో పేలవ ప్రదర్శనని కొనసాగించారు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మని మోర్నీ మోర్కెల్ ఔట్ చేయగా.. కోహ్లితో సమన్వయలోపం కారణంగా ధావన్ రనౌటయ్యాడు.

 

రహానె భాగస్వామ్యంతో ఆడిన కోహ్లి కెరీర్‌లో 33వ శతకాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి జట్టుకి విజయాన్ని అందించాడు..జట్టు స్కోరు 256 వద్ద రహానె ఔటవగా..262  వద్ద కోహ్లి పెవిలియన్ చేరాడు...అయితే జట్టుకి విజయాన్ని చివర్లో మాత్రం ధోని  (4 నాటౌట్) అందించాడు..ఇదిలా ఉంటే రెండో వన్డే సెంచూరియన్ వేదికగా ఆదివారం జరగనుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: