గ్లాస్: గుర్తుపై చేతులెత్తేసిన ఈసీ..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూటమిలోని గాజు గ్లాసు గుర్తు చాలా ఉత్కంఠ రేపుతోంది. కామన్ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు గుర్తును చేర్చిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఇది జనసేన పార్టీకి పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన జనసేన హైకోర్టు వరకు వెళ్ళింది.. టిడిపి కూడా ఏపీ హైకోర్టులో అత్యవసర పిటీషన్ కూడా దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ పైన విచారణ సందర్భంగా ఈ గాజు గ్లాసు గుర్తుపైన పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఎన్నికల కమిషనర్.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తుని జనసేన పార్టీకి రిజర్వుడ్ చేయలేమంటూ కూడా కోర్టుకు ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసింది.. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యిందని ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ ని అసలు మార్చలేమంటూ కోర్టుకు తెలిపేసింది ఈసీ.. ఈ పిటిషన్ కూడా అర్హత లేదంటూ కూడా తెలియజేసింది.. ఒకవేళ ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు కూడా ఈ పిటీషన్లు వస్తూ ఉంటాయంటూ కోర్టు ముందు పలు రకాల వాదనలు వినిపిస్తోంది ఎన్నికల కమిషన్.

ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ లను కూడా ఆర్మీడ్ ఫోర్స్ కు అప్పజెప్పామంటూ కోర్టు వెల్లడించింది.. ఫ్రీ పోల్ అలయన్స్ ను గుర్తించడానికి చట్టబద్ధమైనటువంటి ఎలాంటి రూల్ లేదని కోర్టుకు ఈసీ తెలిపింది. జనసేన పార్టీ చేసిన అభ్యంతరాల పైన నిన్నటి రోజున కొన్ని నిర్ణయాలను కూడా కోర్టు వెల్లడించిందట.. టిడిపి, బిజెపి పార్టీలతో ప్రీపోల్ అలియన్స్ ఉందంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన టిడిపి పార్టీ.. వీటితోపాటు పొత్తుతో టిడిపి, బిజెపి, జనసేన ఉన్నదని ఎన్నికలలో ప్రచారం కూడా చేస్తున్నామంటూ టిడిపి న్యాయవాది వెల్లడించారు.. అయితే ఇప్పటికి సింబల్స్ మార్చడానికి స్కోప్ ఉందని ఈసీ తెలపగా.. 5 ఎంపీ 62 అసెంబ్లీ పరిధిలో గాజు గ్లాసు గుర్తు అలానే ఉంటుందంటూ కోర్టులో తెలియజేసింది టిడిపి. అయితే కొంతమంది నిరక్షరాశులు సింబల్స్ పైన కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఈ సింబల్ ని మార్చాలంటూ స్వతంత్ర అభ్యర్థులకు వేరే గుర్తులను ఇవ్వాలంటూ కోరారు టిడిపి. దీంతో ఈ విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది ఏపీ హైకోర్టు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: