ఏపీ: ఇంతవరకు నియంత పాలన చూసారు, ఇకపై ప్రజాస్వామ్య పాలన చూస్తారు: టీడీపీ

Suma Kallamadi
ఏపీలో ఎన్నికలకు ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో విపక్షాల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో టీడీపీ కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థి అయినటువంటి బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు అధికార పార్టీని కడిగి పారేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించి ప్రజాస్వామ్య పాలనను నిర్మిద్దామని చెప్పుకొచ్చారు. విషయంలోకి వెళితే, నిన్న బుధవారం మండలంలోని శీరంగాపురం, కొసనపల్లె, గోవర్థనగిరి, గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా విశేష జనం తండోపాతండాలుగా రావడం జరిగింది.
కొసనపల్లెలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ... "బడుగు బలహీన వర్గాలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నాకు టీడీపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా టికెట్‌ ఇచ్చి ఊపిరి పోసింది. బీసీలకు అండదండగా ఉన్న ఏకైక పార్టీ టీడీపీ పార్టీయే. టీడీపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోకు ఆంధ్రా ప్రజలు జేజేలు కొడుతున్నారు. సైకిల్‌ గుర్తుకు 2 ఓట్లు వేసి ఈ అరాచక పాలనను గద్దె దింపాలి." అని గట్టిగా చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శైలజా సుబ్బరాయుడు, మాజీ మండల అధ్యక్షుడు జయరాముడు, మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌గౌడు, రామకృష్ణ ఆచారి, మాధవరావు, రామకృష్ణ, గోపాల్‌, రామచంద్రుడు, ఈదుల వెంకటరాముడు, రామాంజనేయులు పాల్గొన్నారు.
ఇకపోతే ఈ నేపథ్యంలో కేఈ శ్యాంబాబు పలువురు కార్యకర్తలకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కాగా ఎన్నికలు సమీపిస్తుండటంతో స్థానిక జడ్పీటీసీలు పి.పురుషోత్తం చౌదరి జమేదార్‌ రాజన్న యాదవ్‌, మదనంతపురం శ్రీనివాసులు, జిల్లా టీడీపీ కార్యదర్శి గూడూరు ధనుంజయుడు, గడ్డం రామాంజనేయులు, రంగయ్య,  ఎన్‌.లక్ష్మీనారాయణ, ఉన్నారు. ఈ తరుణంలో మండలంలోని సంగాల, బోయ బొంతిరాళ్ల, ఎర్రబాడు, తుగ్గలి మండలం మారెళ్ల గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరడం జరిగింది. కంబాలపాడు గ్రామంలో పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు పార్లమెంట్‌ కార్యనిర్వహక కార్యదర్శి ఆలంకొండ నభి సాహెబ్‌, నాయకులు కటారుకొండ మర్రి శ్రీరాములు తదితరులు పాల్గొనడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: