ఆ థియేటర్ల మూసివేత నిజం కాదట.. ఇదీ అసలు విషయం?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల మూసివేత అవాస్తవమని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పష్టం చేసింది. థియేటర్ల మూసివేతపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అపెక్స్ బాడీతో సంబంధం లేకుండా ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రసన్న కుమార్ తీవ్రంగా ఖండించారు. థియేటర్ యజమానులు కానీ ఇతర అసోసియేషన్ల నుంచి ఎవరు నిర్మాతల మండలికి నోటీసులు ఇవ్వలేదని ప్రసన్న కుమార్ పేర్కొన్నారు.
తక్కువ వసూళ్లు రావడంతో కొందరు యజమానులు వ్యక్తిగత నిర్ణయం తీసుకొని థియేటర్లను మూసివేశారని ప్రసన్న కుమార్ అన్నారు. దానికి నిర్మాతల మండలికి సంబంధం లేదని ప్రసన్నకుమార్ తెలిపారు. ఎన్నికలు, ఐపీఎల్ మ్యాచ్ లు సినిమా ఆదాయంపై ప్రభావం చూపడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రాలేకపోయారన్న ప్రసన్న కుమార్.. అందువల్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్ యజమానులు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని ప్రదర్శనలు ఆపేశారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: