నేనుంటే.. ప్లే ఆఫ్స్ కి వెళ్లే వాళ్ళం.. పంత్ కామెంట్స్ వైరల్?

praveen
ప్రస్తుతం ఇండియాలో క్రికెట్ పండుగ కొనసాగుతుంది. ఐపీఎల్ పోరు ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. దాదాపు నెల నెల రోజులపాటు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఐపీఎల్ టోర్ని ఇక ఇప్పుడు కీలక దశకు చేరుకోవడంతో పోరు మరింత రసవత్తారంగా మారిపోయింది. అయితే ఇప్పటికే ప్లే ఆప్స్ లో అడుగు పెట్టబోయే మొదటి నాలుగు టీమ్స్ ఏవి అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. సన్రైజర్స్, రాజస్థాన్, కోల్కతా జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ కోసం క్వాలిఫై అయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టబోయే నాలుగో టీం ఏది అనే విషయం గురించి ఉత్కంఠ నెలకొంది.

 కాగా 2024 ఐపీఎల్ సీజన్లో అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తప్పకుండా ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుంది అని అభిమానులు అందరూ కూడా నమ్మారు. ఎందుకంటే దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ఆ జట్టు పాత కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి సారధ్య బాధ్యతలను చేపట్టి జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే ఒకవైపు కెప్టెన్సీ లోనే కాదు మరోవైపు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అదరగొట్టాడు. కానీ మొదటి నుంచి ఆ జట్టును దురదృష్టం వెంటాడుతూనే వస్తుంది  ఐపీఎల్ లో మూడు మ్యాచ్లలో స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం కారణంగా రిషబ్ పంత్ ఓ మ్యాచ్ లో ఆడకుండా నిషేధానికి గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఈ క్రమంలోనే రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ లేకుండా ఇక ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో బరిలోకి దిగింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో చెత్త ప్రదర్శన చేసి 47 పరుగులు తేడాతో ఓడిపోయింది. దీంతో ఇక ఢిల్లీ జట్టు రన్ రేట్ ఒక్కసారిగా పడిపోయింది. ఇక ఇదే ఆ జట్టుకు మైనస్ గా మారింది. ఇటీవల సన్రైజర్స్ ప్లే ఆఫ్ కి అధికారికంగా క్వాలిఫై కావడంతో ఢిల్లీ జట్టు చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. ఇంకా ఇదే విషయంపై మాట్లాడిన పంత్ ఆర్సిబి తో మ్యాచ్లో తాను ఆడి ఉంటే నాకౌట్కు చేరే వాళ్ళం అంటూ చెప్పుకొచ్చాడు. తన వల్లే జట్టు గెలుస్తుందని కాదు.. ప్లే ఆఫ్ కి చేరేందుకు మరింత మెరుగైన అవకాశాలు ఉండేవి అంటూ పేర్కొన్నాడు పంత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: