ఏపీ లోకల్ టాక్ : కర్నూలు నియోజకవర్గంలో గెలుపెవరిది.. ఆ అభ్యర్థి మెజారిటీ ఎంతంటే?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ పూర్తై మూడు రోజులు అవుతోంది. గెలుపు విషయంలో ఏ పార్టీ అంచనాలు ఆ పార్టీకి ఉన్నాయి. అయితే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు ఏ పార్టీది అనే చర్చ జరుగుతుండగా ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం కూడా ఒకటి కావడం గమనార్హం. కర్నూలులో కూటమి తరపున భరత్ పోటీ చేస్తుండగా వైసీపీ తరపున ఇంతియాజ్ పోటీ చేస్తున్నారు.
 
ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయిన టీజీ భరత్ స్వల్ప మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉందని పొలిటికల్ వర్గాల టాక్. 5000 మెజారిటీతో భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమిని గెలిపించే ఛాన్స్ అయితే ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు వైసీపీ కంచుకోట అయినా టీజీ భరత్ కు స్థానికంగా మంచి పేరు ఉండటం ఆయనకు కలిసొచ్చింది.
 
కర్నూలు నియోజకవర్గంలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండటం ఇంతియాజ్ కు ప్లస్ అయినా ఆయన నాన్ లోకల్ కాకపోయినా నాన్ లోకల్ అని ప్రచారం చేయడం ఒకింత మైనస్ అయింది. జిల్లాలో వైసీపీ అభిమానులు ఇప్పటికీ ఇంతియాజ్ కు గెలుపు అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. కర్నూలు నియోజకవర్గం ఫలితం విషయంలో ఒకింత ఉత్కంఠ నెలకొంది.
 
జగన్ సైతం కర్నూలులో ఇంతియాజ్ ను గెలిపించాలని ప్రచారం చేయడం గమనార్హం. 2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీకే అనుకూల ఫలితాలు వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ నియోజకవర్గంలో కూటమి బలపడటం, అర్బన్ ఓటర్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీకే అనుకూల ఫలితాలు రానున్నాయి. జగన్ సైతం కర్నూలు, కడప జిల్లాల ఫలితాలు వైసీపీకి ఎంతో ప్లస్ అవుతాయని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: