కౌంటింగ్ కి ముందే.. ఏపీలో ఆ 5గురు విజయం ఖాయమైందా?

praveen
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన ఏపీ రాజకీయాలలో వేడి మాత్రం తగ్గలేదు. ఎందుకంటే పోలింగ్ ముగిసినప్పటికీ ఇంకా ఒక పార్టీ నేతలు మరో పార్టీల నేతలపై దాడులకు పాల్పడటం సంచలనంగా మారిపోయింది. ఇక పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది . ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చోట 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. అయితే ఇటీవల పోలింగ్ అయితే ముగిసింది. దీంతో ఎవరు విజయం సాధించబోతున్నారు అనే విషయంపై కూడా తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. కూటమి అధికారంలోకి వస్తుందని కొంతమంది.. వైసిపి రెండోసారి వరుసగా అధికారాన్ని చేర్జి ఎక్కించుకుంటుందని కొంతమంది అంచనా వేస్తున్నారు.

 అయితే ఈసారి ఏపీలో పోలింగ్ శాతం పెరగడం కూడా మరింత సంచలనంగా మారింది. ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనే విషయంపై కూడా ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో 80.66% పోలింగ్ నమోదైనట్లు ఇటీవల ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా ఏడు నియోజకవర్గాలలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక ఓటింగ్ నమోదయిందట. ఆంధ్రాలోని అన్ని నియోజకవర్గాల కంటే హైయెస్ట్ పోలింగ్ చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిందట.

 ఏకంగా కుప్పం నియోజకవర్గంలో 89.8% పోలింగ్ జరిగిందట. ఇది నిజంగా సంచలనం అని చెప్పాలి. ఇక లోకేష్ ప్రాతినిధ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో 85.7% పోలింగ్ నమోదయిందట. పవన్ కళ్యాణ్ బరిలో నిలిచిన పిఠాపురంలో 86.6 శాతం..  సీఎం జగన్ కంచుకోట పులివెందులలో 81.4 శాతం, బాలకృష్ణ ప్రాతనిత్యం వహించే హిందూపురం 77.2 పోలింగ్ నమోదయిందట. ఇలా ప్రముఖుల నియోజకవర్గాలలో పోలింగ్ పర్సంటేజ్ ఒక్కసారిగా పెరిగింది.  దీన్నిబట్టి ఇక ఈ ప్రముఖులను గెలిపించుకునేందుకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు అన్నది తెలుస్తుంది. ఈ ఐదు నియోజకవర్గాలలో కూడా కీలక నేతలదే  భారీ మెజార్టీతో విజయం అని అంచనా వేస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: