పెన్షన్ కష్టాలు: దెబ్బకు తలలు పట్టుకుంటున్న టిడిపి నేతలు..!

Divya
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ చేసిన పని వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టిడిపి పరిస్థితి మరింత దిగజారి పోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అవ్వతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ ని ఇంటి వద్దకు రాకుండా చేయడంతో వారు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు.. మార్చి నెల వరకు వాలంటరీలు అందరూ కూడా పింఛన్లు ఇంటి వద్దకే ఇచ్చేవారు.. దీంతో చాలామంది టీడీపీకి అనుకూల వ్యక్తులు వాలంటీర్లు చేత పింఛన్ పంపిణీ చేయకూడదంటూ పలువురు నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈనెల అవ్వతాతల పించినీనీ బ్యాంకుల్లో జమ చేశారు.

పింఛను డబ్బుల కోసం ఇంతటి ఎండలో బ్యాంకుల వద్ద క్యూ నిలబడి ఉండడంతో పాటు బ్యాంకుల వద్ద గుంపులు గుంపులుగా ఉండడంతో అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. 60 ఏళ్ళు దాటిన వృద్ధులను చంద్రబాబు టిడిపి నేతలు ఇంతలా ఇబ్బంది పెట్టడంతో సామాన్య ప్రజలు కూడా వీరి పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు.. దీంతో చంద్రబాబు ఇంకా అధికారంలోకి రాకనే ఇన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటే ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి అధికారం వస్తే మరిన్ని ఇబ్బందులు చేస్తారని ఈసారి ఓటు మాత్రం కూటమికి వేయకూడదంటూ అవ్వదాతలు తెలియజేస్తున్నారు.

దీంతో పలు టిడిపి అభ్యర్థులు కూడా తలలు పట్టుకుంటున్నారు.. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల టిడిపి గ్రాఫ్ కూడా తగ్గుతూ వస్తోంది. గ్రామాలలో ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుల చుట్టూ పింఛనీ కోసం తిరగాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. దీనంతటికీ కారణం చంద్రబాబు నాయుడు అన్నట్టుగా తెలుపుతున్నారు. వాలంటీర్లపైన విషం చిమ్మి సకాలంలో  పించిని  అందకుండా చేసినటువంటి చంద్రబాబుకు మా శాపం కచ్చితంగా తగులుతుంది అంటూ కన్నీటి పర్వతంతో తెలియజేస్తున్నారు.  చంద్రబాబు నాయుడు 2014లో చేసిన పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి 2019 ఎన్నికల ఫలితాలే అందుకు ఉదాహరణ.. ఎన్నికలకు మరో పది రోజులు సమయం ఉన్న సమయంలో చంద్రబాబు పైన ఇంతటి వైర్యం రావడంతో పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: