భారతీయుల సోమరితనమే విఙ్జానాన్ని హరించిందా!

మన పెద్దలు ఏదైనా అసాధారణ విషయం చెపితే  "పుక్కిట పురాణాలు" చెప్పొద్దంటారు. అలాగే ఆధునిక శాస్త్ర విఙ్జానంలోని ఆవిష్కరణల గురించి (ఇన్వెన్షన్) ఎవైనా విషయాలను మనవాళ్ళు ఎప్పుడో కనుగొన్నారు మన పురాణ కథలతో పోల్చి  అంటే యువత వెక్కిరింపులు వింటూనే ఉన్నాం. అవన్నీ పక్కన బెట్టి సాధారణంగా మనం వింటూ ఉండే విషయాలను అంటే మన ఇతిహాసాల్లో - ముఖ్యంగా మహాభారతంలో - రాసినవి "నిజంగా జరిగి ఉంటే అద్భుతం. జరగనట్లైతే మన కవుల ఊహాశక్తిని - కవుల కల్పనని మహాద్భుతం అని అనకుండా ఉండలేము" 

ఉదాహరణకు:
 
*రామాయణం లో రావణాసురుడికి పుష్పక విమానం ఉండేది. అది ఏవియేషన్‌.... అంటే ఆకాశయానం! అనేది నిజమే కదా!

*తన కంటే ముందు తన తోటి కోడలు కుంతికి పుత్రుడు పుట్టాడనే ఆక్రోశంతో గర్భవిచ్ఛిత్తికి పాల్పడింది గాంధారి. అలా ఛిద్ర మైన గర్భస్త పిండాన్ని వ్యాసుడి సూచన సలహాతో నేతికుండల్లో పెట్టి జాగ్రత్త చేశారు అలా ముక్క చెక్కలైన పిడాలు ఒక్కొటి ఒక్కో సంతానమై అలరించిన పుట్టినవారే కౌరవులు. వాళ్లని టెస్ట్‌-ట్యూబ్‌ బేబీలు అనవచ్చా? అంటే అనకూడదు కాక
అన కూడదు.

ఎందుకంటే టెస్ట్ ట్యూబ్ బేబీలు అనేది పూర్తిగా వేరే శాస్త్రీయ వ్యవహారం. ఇక్కడ కౌరవుల పిండం ఏర్పడడంలో సాంకేతికత ప్రమేయమేమీ లేదు. గాంధారి సహజ గర్భధారణ -- మామూలు గానే జరిగింది. గర్భ విచ్చిత్తి అంటే అబార్షన్ వలన ముక్కలైన పిండాన్ని నూరు నేతికుండల్లో పెట్టి బ్రతికించడం అన్నమాట. ఐతే కౌరవులు పూర్తిస్థాయిలో పిండం ఎదగకుండానే పుట్టిన "ప్రీ-మెచ్యూర్ బేబీలు" అన్నమాట. వాళ్లను నేతికుండల్లో పెట్టి పెంచారు. ఆ నేతి కుండలను నేటి "ఇన్‌క్యుబేటర్ల" తో పోల్చవచ్చు.

*ఐతే మహాభారతంలోనే అంతకు రెండుతరాల ముందుపుట్టిన "టెస్ట్ ట్యూబ్ బేబీ" - ద్రోణుడు అనే ఆయన ఒకరున్నారు. ఆ ద్రోణుణ్ణే దానవీరశూరకర్ణ సినిమాలో "నీచమైన మట్టికుండలో పుట్టితివికదయ్యా?" అని ఈసడిస్తాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక  రామారావు దుర్యోధనుడు పాత్రలో. ద్రోణుడి కంటే ముందు అదే పద్ధతిలో పుట్టినవాళ్ళు అగస్త్యుడు, వసిష్ఠుడు. ఇద్దరికిద్దరూ  గొప్పఋషులు. ఈ వసిష్ఠుడు రఘువంశానికి కులగురువైతే అగస్త్యుని గురించి లెక్క లేనన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. 

*వినాయకుడికి ఏనుగు తల అతికించాడు శివుడు అంటే ప్లాస్టిక్‌ సర్జరీ. ప్రస్తుతానికైతే తలలు మార్చిన వైద్య అద్భుతం జరగలేదు కాని కానీ తెగిపడిన వేళ్లూ కాళ్లూ అతికించే దశలో ఉన్నాం. అలాగే అగ్ని ప్రమాదాల్లో యాసిడ్ దాడుల్లో రూపం కోల్పోయిన వారికి - అందం ఇనుమడింప జేసుకోవాలనుకున్న వాళ్ళ శరీర బాగాలను రిపేర్ చేసి లేదా కరక్ట్ చెసే వైద్య సాంకేతికత పుష్కళంగా కలిగి ఉన్నాం. మంచి అభివృద్ధే! కదా! 

*సరే చివరకు మన పురాణాలన్నిట్లో కనిపించే మాయమవడం, ప్రత్యక్షమవడం, అష్టసిద్ధులూ! అన్నీ కథలూ, కల్పితాలే నంటారా! మరీ అంత తొందరపడి కొట్టిపారేయ కూడదు కదా! స్వప్నం, కల్పన, ఊహల నుండే అద్భుతాల ఆవిష్కరణ  జరుగుతుంది. 

అందుకే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కలలు కనండి - కాని ప్రయత్నిచి కొత్త ఆవిష్కరణలకు పునాదులెయ్యండి. ఒకనాటి  కాలంలో మన  దేశం అదే జంబూద్వీపంలో శాస్త్ర సాంకేతికత ఆస్థాయిలో జరిగి ఉండవచ్చు. ఆ తరవాత జరిగిన ప్రళయాల్లో అవి పూర్తిగా మటుమాయమై ఉండవచ్చు -

అనాటి మన ఆవిష్కరణలు రిపీట్ కాకపోవటానికి కారణం మనవాళ్ళు సోమరిపోతులవటం వలననో, రాజ్యం అనుగ్రహం ప్రోత్సాహం లేకపోవటంతో, ఆ తెలివి తెటలు - మనలో "డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం" ప్రకారం బహుకాలం  ఉపయోగించని దేహాంగాలు తరవాతి తరాల్లొ మాయమై పొతాయన్నట్లు - మన ఙ్జాన విఙ్జాలు క్రమంగా మనం సోమరుల మవటం వలన మనలో అంతరించి వాటిని ఉపయోగించే విదేశీయుల్లో పునఃసృష్టి జరిగి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: