వినాయక చతుర్థి విశిష్టతలు!

మనలో చాలామందికి వినాయకుడు అంటే ఒక దేవుడు అని శివపార్వతుల కొడుకని మాత్రమే తెలుసు కాని '' వినాయకుడు '' అనే పదానికి ఒక అర్థం ఉంది.  ఆ అర్థం ఏమిటంటే '' నాయకుడు లేనివాడు '' అని అర్థం. అంటే తనకు తనే నాయకుడు అని. విఘ్నాలను నివారించే గణపతి జన్మదినమే వినాయకచవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున వినాయక చవితి పండుగను నిర్వహిస్తారు. ఆదిదంపతుల ప్రథమ కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పనిని ప్రారంభించరు. వినాయకుని అనుగ్రహం ఉంటే అన్ని విజయాలే లభిస్తాయి. ఈ చవితి నాడు ఉత్సవాల్లో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. 


త్వమేవాహమ్', 'అహంబ్రహ్మోసి' అన్న భావమే అది. అందుకే మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతినే పూజ చేస్తారు పూజారులు. ఏ గణానికైనా అతడే 'పతి' జగత్తు. ఎందుకంటే అంతా 'గణ' మయమే కాబట్టి ! వివిధ గణ సమాహారమే ఈ విశ్వమని మనకు ఎన్నో పురాణాలు చెబుతుంటాయి. 'గ' అనే అక్షరం నుంచే జగత్తు జనించింది. కరచరణాద్యనయన విన్యాసం మొదలుకుని, ఎలాంటి శబ్దమైన భాష, భాషాత్మకమైన జగత్తు. అంతా 'గ' శబ్ద వాక్యం . దీన్ని సుగుణానికి సంకేతం అంటారు. 'ణ' కారం మనసుకు, మాటలకు అందని పరతత్త్వానికి గుర్తు. ఇది నిర్గుణ సంకేతమన్నమాట! సుగుణంగా, నిర్గుణంగా భాసించే ఈశుడే 'గణేశుడు'. అతడే 'గణపతి'. ఆ పదహారు రూపాలలో కొలువై ఉన్నాడని మనకు మన పెద్దలు చెబుతుంటారు.


కొన్ని ప్రాంతాల్లో గణపతి నవరాత్రులు నిర్వహిస్తుంటారు. ప్రతి ఇంట్లో వినాయకుడి బొమ్మను వివిధ రకాల పువ్వులు, పత్రితో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తుంటారు. వినాయకుని నవరాత్రుల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. భారతీయ సంప్రదాయంలో అన్ని వర్గాలలో జరుపుకునే పండుగల్లో వినాయక చవితి అగ్రస్థానం.  గత కొన్ని సంవత్సరాలుగా వినాయక విగ్రహాల తయారుచేయడానికి పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. మట్టితో గణపతి విగ్రహాల తయారీతో పాటు పర్యావరణ హితమైన రంగులను వాడుతుంటారు. దీంతో పలు తటాకాలు, నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయి.   

పదహారు రూపాల గణపతులు.

1. బాలగణపతి

2. తరుణగణపతి 

3. భక్తగణపతి 

4. వీరగణపతి 

5. శక్తి గణపతి 

6. ధ్వజ గణపతి 

7. పింగళ గణపతి 

8. ఉచ్ఛిష్ట గణపతి 

9. విఘ్న గణపతి 

10. క్షిప్ర గణపతి 

11. హేరంబ గణపతి 

12. లక్ష్మీగణపతి 

13. మహాగణపతి 

14. భువనేశ గణపతి 

15. నృత్త గణపతి 

16. ఊర్ధ్వగణపతి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: