శనివారం రోజున ఇలాంటి వస్తువులను తీసుకురాకూడదు..!

Divya
వారంలో ఏడు రోజులు ఉన్నప్పటికీ.. మనం మనకు ఇష్టమైన రోజున దేవుడిని కొలుస్తూ ఉంటాము. అయితే శనివారం రోజున ఎక్కువగా ఆంజనేయ, వెంకన్న స్వామికి పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇక అంతే కాకుండా వారికి ఇష్టమైన నైవేద్యాన్ని కూడా సమర్పించి వారి ఆశీస్సులను పొందాలని చూస్తాము. ఇదంతా ఇలా ఉండగా శనివారం రోజున ఇలాంటి, వస్తువులను మనం తీసుకోకూడదట.ఒకవేళ శనివారం రోజున ఎలాంటి వస్తువులను కొన్నట్లు అయితే ఏం జరుగుతుందో.. ఏ వస్తువులు కొనకూడదు వాటి వెనుక ఉన్న ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
1).  మన శాస్త్రాల ప్రకారం శనివారం దినమున నల్లగా ఉండేటువంటి ఏ వస్తువులను కొనకూడదు. ఏదైనా నల్లటి వస్తువులను దానంగా ఇవ్వవచ్చుఅట. నల్లని వస్తువులు కొన్న ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయట.
2). శనివారం రోజున ముఖ్యంగా మనం దీపారాధన చేసేటప్పుడు... నువ్వుల నూనె తో చేస్తే చాలా మంచిదట. ఆ రోజున శని దేవుడు అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నల్లని నువ్వులను ఈరోజు కొన్న కూడదట.
3). ఇక ఇనుము వంటి వస్తువులలో కత్తులు, కత్తెర వంటివి శనివారం రోజున తీసుకోకూడదట.అవి ఆరోజున తీసుకున్నట్లయితే ఎన్నో పరిణామాలకు దారితీస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
4). తోలు వస్తువులకు సంబంధించి శనివారం రోజున ఎటువంటి వస్తువులను కొనకూడదు.అవి అపజయానికి దారి తీస్తాయి.
5). శనివారం దినమున సాల్ట్ తీసుకుంటే ఎక్కువగా అప్పులపాలు అవుతారట.
6). శనివారం దినమున ఏదైనా కొత్త వాహనాలను కొనుగోలు చేయరాదు, ఎందుకంటే ఇవి లోహంతో తయారయ్యి ఉంటాయి. అందుచేతనే ఇలాంటి వస్తువులను ఈ రోజున కొనరాదు. ముఖ్యంగా కొత్త బట్టలు కూడా కొనడం మంచిది కాదట.
7). గోర్లు కత్తిరించడం, గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టడం వంటివి శనివారం దినమున చేయరాదని మన పూర్వీకులు తెలియజేస్తూ ఉంటారు.ఇలాంటివి చేసే టప్పుడు ఆలోచించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: