శివలింగాన్ని ఇలాంటి వాటితో పూజించకూడదు..!a
ముందుగా శివుడు గుళ్లో వెళ్ళినప్పుడు శివలింగాన్ని మనం ఒకసారి చూసినట్లయితే.. లింగానికి తిలకం అనేది ఇది అసలు ఉండదట. అందులో చాలా లోతైన సమాధానం ఉందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. ఎర్ర రంగు లో ఉన్నటువంటి పూలు, టెంకాయ నీళ్లు, తులసి పువ్వలు వంటి వస్తువులతో శివుని పూజించరాదు.ఎటువంటి వాటితో చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయో చూద్దాం.
అందరూ విగ్రహం రూపంలో ఉన్న దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. కానీ పరమేశ్వరుని మాత్రం లింగరూపం లోనే పూజిస్తారు. శివుడికి పూజ చేసేటప్పుడు తిలకం, సింధూరం మంచివి తీసుకుని పోరాదు. కొంతమంది పండితులు తెలిపిన ప్రకారం శివుడికి తిలకం దిద్దితే అరిష్టమని తెలియజేస్తున్నారు. అందు చేతనే శివుడికి ఎన్నడు తిలకాన్ని దిద్దరు.
హిందువులు ఎక్కువగా పసుపుని పవిత్రంగా భావిస్తూ ఉంటారు. చేరిన శుభకార్యాలకు వీటిని తప్పక ఉపయోగిస్తూ ఉంటారు. దేవుళ్ళను పూజించేటప్పుడు ప్రత్యేకంగా పసుపును పవిత్రంగా భావించి వాడుతూ ఉంటాము. కొంతమంది పండితులు తెలిపిన ప్రకారం శివలింగం అనేది కేవలం పురుష వ్యక్తిత్వం కి సంబంధించింది. ఇక పసుపు అనగానే మనకి మహిళలు గుర్తుకు వస్తారు కనుక పసుపును శివుడి పూజలో వాడక పోవడానికి కారణమని తెలియజేస్తున్నారు.
ఎంతోమంది దేవుళ్ళకు మనం శంఖంతో అభిషేకం వంటివి చేస్తూ ఉంటాము. కానీ శివలింగానికి మాత్రం అలా చేయకూడదట. ఎందుకంటే శంఖచుడు హాయ్ రాక్షసుడిని శివుడు వధించాడు కాబట్టే వాటితో శివలింగాన్ని పూజించకూడదు. శివుడిని బిల్వపత్రి ఆకులతోనే పూజించాలి. మరి ఇతర ఆకులతో పూజించకూడదు. ముఖ్యంగా శివలింగాన్ని ఎర్ర రంగు లో ఉన్నటువంటి పూలతో ఎన్నటికీ పూజించకూడదు.