డబ్బు, ఆస్తి సమస్యలు ఉన్నవారు ఇలా చేస్తే సరి..!

Divya
ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, దేవుడిని మాత్రం ఆ కష్టాలను తొందరగా దూరం చేయమని మనం కోరుకుంటూ ఉంటాము. హిందూమతంలో ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ. మనం మన ఇష్టదైవాలను మాత్రమే కోరుకుంటూ ఉంటాము. దాంతో భగవంతుడు తమ ప్రియమైన భక్తులకు కోరికలను నెరవేర్చేందుకు సహాయపడుతూ ఉంటాడు. ముఖ్యంగా లక్ష్మీ దేవత, హనుమంతుడిని కచ్చితంగా పూజించాలట. ఎందుచేతనంటే వీరిద్దరిని పూజించడంవల్ల సిరిసంపదలు.. ఆయనంత వెదజల్లుతాయని పండితులు చెబుతున్నారు.డబ్బులు, ఆస్తి సమస్యల నుంచి మీరు ఇబ్బంది పడుతుంటే.. హనుమన్ , లక్ష్మీ పూజ చేయడం మంచిదట.. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.
రాత్రిపూట పడుకునే సమయాలలో హనుమాన్ మంత్రాన్ని జపించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయట. స్నానం చేసిన తరువాతనే హనుమన్ మంత్రాన్ని జపించాలి. ఒకవేళ లక్ష్మి ఆరాధన కూడా చేయవచ్చు. దీంతో లక్ష్మీదేవి సంతోషించి మన ఇంటికి సంతోషకరంగా వస్తుంది. ఇంకా లక్ష్మీ దేవత ఫోటోను ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిదట. ఇక లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి ప్రతిరోజు, ఆ దీపాన్ని తులసి చెట్టు ముందర ఉంచితే ఇంకా మంచిదట.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. పూజలో తామర పువ్వు లేదా కమలం నువ్వు అంటే లక్ష్మీ దేవత కి చాలా ఇష్టమట. ఈ రెండింటిలో ఏదో ఒక పువ్వును లక్ష్మీదేవి ముందు ఉంచి ఆమె మంత్రాన్ని జపించినట్లయితే లక్ష్మీ దేవత ఆశీస్సులు మనకి లభిస్తాయట.
అమ్మ వారిని మన ఇంటికి ఆహ్వానించే ముందు ఇంటిని నీటిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఎవరింట్లో అయినా గొడవలు కానీ కోపంగా గానీ  ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీ దేవత నిలువ ఉండదట. అంతే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఆనందంగా లేకపోతే లక్ష్మీదేవి ఉండదట. సిరి సంపదలు కావాలంటే.."ఓం మహాలక్ష్మియే నమః" అనే మంత్రాన్ని 12 సార్లు జపించాలి. అప్పుడు ఆ ఇంట సిరి సంపదలు వెదజల్లుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: