జగనన్న పాలన : అమ్మ వారి పండుగకు గ్రీన్ సిగ్నల్ !

RATNA KISHORE
జీవితాలను మలుపు తిప్పే పండుగ అంటే అందరికీ ఇష్టం. తల్లిని వేడుకుంటే బిడ్డకు ఆనందం. తల్లిని సేవిస్తే బిడ్డకు జన్మ సాఫల్యం. సుకృతం అంటే ఇది అని వర్ణించే పండుగ వేళ నేషనల్ హెరాల్డ్ మీడియా తరఫున శుభాకాంక్షలు..అందరికీ..తెలుగు వారి అందరికీ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ..


ఆశ్వయుజ మాసాన జరుపుకునే వేడుకలు ఇవి. పిల్లా పాపలతో అంతా  గ్రామాలకు తరలివచ్చి చేసుకునే వేడుకలు ఇవి. వేడుక ఏదయినా మనుషులను కలిపి ఉంచుతుంది. తెలంగాణ లో జోగులాంబ, ఆంధ్రాలో ఇంద్ర కీలాద్రి పై వెలసిన కనకదుర్గ ఈ వేళ భక్తులకు వివిధ అలంకారాల్లో  నవవిధ శక్తి రూపాల్లో దర్శనం ఇవ్వనున్నారు. ఆ అలంకార శోభ, ఆ పుష్పార్చన అన్నది కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. అమ్మను పూజించి తరించేందుకు వచ్చే భక్తులకు కోవిడ్ నిబంధనల పాటింపు తప్పని సరి అని రెండు తెలుగు రాష్ట్రా ల పెద్దలూ చెబుతున్నారు. జాగ్రత్త పాటించండి ప్లీజ్ అని విన్నవిస్తున్నాయి.. మీ జాగ్రత్త శ్రీ రామ రక్ష అని అర్థిస్తున్నాయి. ఈ పండుగకు జగన్ అనుమతి ఇచ్చారు. శుభవార్త అందించి, తనవంతు బాధ్యతను నిర్వర్తించారు. కేసీఆర్ కూడా బతుకమ్మ ఉత్సవాలకు హాజరు కానున్నారు. అలానే ఆంధ్రా నుంచి తెలంగాణ వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతు న్నాయి. రెండు ప్రాంతాల క్షేమాన్నీ కాంక్షించే గొప్ప వేడుక ఇది అని వైదికులు చెబుతున్నారు. చల్లని తల్లికి జేజేలు పలుకుతూ, అమ్మ ఆశీస్సులు అందిస్తున్నారు.



శరన్నవ రాత్రి వేడుకల వేళ కృష్ణా నదీ తీరాన కొలువున్న తల్లికి వందనాలు చెల్లిస్తూ భక్తులు తరలిరానున్నారు. ఈ సారి గతంలో మాదిరి కాకుండా కట్టుదిట్టమయిన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కరోనా నిబంధనలు పాటింపు అన్నది కఠిన తరం చేశారు. ఇక గ్రామాల్లో జరుపుకునే అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకూ వివిధ భజన బృందాలు, వైదిక సంఘాలు సిద్ధం అవుతున్నాయి. వీటికి అనుమతి ఇస్తూనే కొన్ని నిబంధనలు సూచించారు. దీంతో ఎటువంటి గందరగోళం తలెత్తకుండా వైసీపీ జాగ్రత్త తీసుకున్న విధానం పలువురి భక్తుల మన్ననలు అందుకుంటోంది.



వినాయక చవితి మండపాలకు అనుమతి ఇవ్వని జగన్ సర్కారు శరన్నవరాత్రుల వేడుకలకు మాత్రం కరుణించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మండపాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చి ఈ సారి ఏ వివాదం రాకుండా అప్రమత్తమైంది. శరన్నవరాత్రి ఉత్సవాల వేళ పరిమిత సంఖ్యలో భక్తులను మండపాలకు అనుమతి ఇచ్చి, వేడుకలు చేసుకోవాలని జగన్ సర్కారు సూచించింది. నిబంధనలు అతిక్రమిస్తే, కోవిడ్ విజృంభించే అవకాశం ఉన్నందున, సంబంధిత ముందు జాగ్రత్త చర్యలు అన్నీ పాటించాలని స్పష్టం చేస్తూ నిర్వాహకులకు ఆమేరకు తగు సూచనలు అందించాలంటూ యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఉత్సవాలకు రంగం సిద్ధం అవుతోంది. రేపటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానుండడంతో ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి.



తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు అన్నీ తీసుకుంది. ఈ సారి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అమ్మవారికి అందించి అమ్మ ఆశీస్సులు అందుకోను న్నారు వైసీపీ పెద్దలు. ఉత్సవాలకు జగన్ హాజరు అవుతారా లేకా దేవాదాయ శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరు కానున్నారా అన్నది ఇంకా స్పష్టత లేదు. మరోవైపు తిరుపతి బ్రహ్మోత్సవాలకూ రంగం సిద్ధం అయింది. ఇక్కడా కరోనా నిబంధనలు కఠినం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: