దమూడేళ్లకే పీఠాధి పత్యం !
కర్ణాటక రాష్ట్రంలోని తుముకూర జిల్లా లో ఉంది చిక్కనాయన హళ్లి గ్రామం. ఈ పల్లె వారం రోజులు వార్తల్లోకి ఎక్కింది. వేద విద్యకు ప్రాధాన్యత ఇచ్చే ఆ పల్లెలో ఉంది కప్పూరు గద్దుగె మఠం. ఈ మఠానికి ఉత్తరాధికారిగా ఇటీవలి వరకూ యతీంద్ర శివాచార్య స్వామీజీ వ్యవహరించారు. ఆయన బోధనలు, ప్రసంగాలు, ప్రవచనాలు కర్ణాటక రాష్ట్రంలో జగద్విదితం. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్నారు. అక్కడి మఠానికి కోవిడ్-19 ప్రభావం ముందు వరకూ నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసేవారు.
సాధారణంగా ఈ మఠాలకు అధిపతులుగా వ్యవహరించే గురువులు తమ శిష్య పరంపరను ముందుగానే ప్రకటిస్తారు. ఎవరి తరువాత ఎవరు పిఠం బాధ్యతలు నిర్వర్తిస్తారు అనే విషయం ముందుగానే ప్రకటితమవుతుంది. భారత్ లోని అన్ని పీఠాలు దాదాపు ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాయి.
కప్పూరు గద్దుగె మఠం పీఠాధిపతి ఈ నెల 25న కోవిడ్ బారిన పడి శివైక్యం చెందారు. దీంతో మఠం బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారు? అనే ప్రశ్న తలెత్తింది. ఈ మఠం పై ఆధార పడి చాలామంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం సాగిస్తున్నారు. ఈ మఠానికి నూతన పీఠాధి పతిగా పదమూడేండ్ల తెజస్ కుమార్ ను నిర్వాహకులు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఎనిమిదవ తరగతి సమానమైన వేద విద్యను అభ్యశిస్తున్న తేజస్ తదుపరి పీఠాధి పతిగా నిర్వహిచనున్నారు. ఈ విషయాన్ని పీఠం పెద్దలు ప్రభుత్వానికి తెలియజేశారు. 2008 ఏప్రిల్ 2న తేజస్ కుమార్ జన్మించారు తదుపరి విద్యను ఆయన మైసూర్ లోని సుత్తూర్ పీఠంలో కొనసాగించనున్నారు. తేజస్ పీఠాధిపతి అయిన తరువాతు ఆయన పేరు మారనుంది.