నేడు వినాయక చవితి సందర్భంగా గణేశుని పూజకు మంచి ముహూర్తం, పూజా విధానాన్ని తెలుసుకుందాం. వినాయకుడు అన్ని విజ్ఞాలను తొలగిస్తాడని భావిస్తారు. గణేశుడు గణాలకు మొదటి ఆరాధకుడు. అందుకే ఏ మంచి పనిని చేపట్టినా ఈ దేవుడిని ముందుగా పూజిస్తారు. ఆ తర్వాత ఇతర దేవతలను ఆరాధిస్తారు. ఏ ఆచారంలోనైనా వినాయకుడినే ముందుగా పూజిస్తారు. వినాయకుడు అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. లోక కళ్యాణమే వినాయకుడి లక్ష్యం. దురదృష్టం ఉన్నచోట దాన్ని తొలగించడానికి గణేష్ పూజ తప్పనిసరి. గణేష్ దేవుడు రిద్ధి, సిద్ధికి అధిపతి. అందువల్ల ఆయన దయ వల్ల సంపద, శ్రేయస్సుకు ఎప్పుడూ కొరత ఉండదు అని నమ్ముతారు. విజయకుడికి దుర్వా, మోదక్ అంటే ఇష్టం. పూజలో ఇవి ఖచ్చితంగా సమర్పించాల్సిందే.
గణేష్ చతుర్థి 2021 శుభ ముహూర్తం -
గణేష్ ఆరాధనకు మధ్యాహ్న ముహూర్తం : 11.02 నుండి 2.29
గణేష్ చతుర్థి ఉపవాసం, పూజ విధానం :
1. ఉదయం శుభ్రంగా స్నానం చేసి మట్టి వినాయక విగ్రహాన్ని తీసుకోండి.
2. గణేశుడిని ఎరుపు రంగు బట్టపై కూర్చోబెట్టండి.
3. గణేశుడికి దుర్వా (గడ్డి), 21 లడ్డూలను ప్రసాదంగా పెట్టండి. వీటిలో 5 లడ్డూలను గణేశుడి ముందు పెట్టండి. మిగిలిన లడ్డూలను పేదలకు లేదా బ్రాహ్మణులకు పంచి పెట్టాలి.
4. సాయంత్రం వినాయకుడిని పూజించాలి. గణేష్ చతుర్థి ప్రత్యేక కథను చదవాలి.
5. ఈ రోజున వినాయకుని సిద్ధి వినాయక రూపాన్ని పూజించి ఉపవాసం చేస్తారు.
6. గణేష్ పూజలో తులసి ఆకులు ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. తులసి తప్ప ఆకులు, పువ్వులన్నీ వినాయకుడికి ప్రీతిపాత్రమైనవి.
7. గణేష్ ఆరాధనలో వినాయకుని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
ఈ పద్ధతులన్నీ సరిగ్గా గుర్తు పెట్టుకుని పద్ధతి ప్రకారం వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగి కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. జై బోలో గణేష్ మారాజ్ కీ !