కృష్ణాష్ఠ‌మి : భారం మోయ‌డం జీవితాద‌ర్శం

RATNA KISHORE
అన్నీ బాధ్య‌త‌లే చుట్టూ ఉన్న‌వ‌న్నీ బాధ్య‌త‌లే
నెర‌వేర్చ‌డంలో మ‌న‌కు ఉదాసీన‌త ఆవ‌హిస్తుంది

క‌ష్టం సుఖం రెండూ ప‌ల‌క‌రిస్తాయి. సుఖాల‌కు ఉన్న విలువను క‌ష్టం ఉంచుకోదు. ఎక్కువ విలువ సుఖాల‌కే ఉంటుంది. క‌ష్టం విలువ క‌ష్టంలో ఉన్న‌ప్పుడే గుర్తింపు. మ‌నిషి త‌న సుఖాల‌నే మ‌న‌నం చేసుకుంటాడు..ఎక్కువ సార్లు.. కంఫ‌ర్ట‌బులిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని భావిస్తాడు. నీ సుఖం క‌నుక ఒక క‌ష్టం ఉంద‌న్న విష‌యానికి నీవెందుకు దాసోహం కాకూడ‌దు అని ప్ర‌శ్నిస్తే పారిపోతాడు. భ‌రించే గుణం., స్పందించే నైజం, ఆడ‌బిడ్డల‌కు అండ‌గా ఉన్న వైనం అన్నీ కృష్ణ‌య్య‌లోనే ఉన్నాయి. పాపాల‌ను స‌హించే గుణం గొప్ప‌ది. దండించే గుణం కూడా అంత‌కుమించి గొప్ప‌ది. దండ‌న‌లో ర‌క్ష‌ణ అన్న‌ది ఉత్త‌మం.

ఎవ‌రిని ర‌క్షించి ఎవ‌రిని  ఈ లోకంలో అతి భ‌ద్రంగా ఉండేలా చేయాలి అన్న‌ది ప్రాముఖ్య సంబంధ విష‌యం. విశేష సంబంధ విష యం. లోకంలో ఇత‌రుల భారాల‌ను నెత్తిన పెట్టుకోవ‌డం సాధ్య‌మా! లోకంలో ఇత‌రుల త‌ప్పుల‌ను స‌హించి మ‌న్నించి పోవ‌డం స హ‌జ‌మా! అస‌లు స‌మాజ గుణం మ‌న్నించే గుణానికి త‌దిత‌ర స‌హ‌జ గుణాల‌కు వ్య‌తిరేకంగా ఉంటుంది. స‌మాజం కొన్ని ప్ర‌తికా రేచ్ఛ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది.

యుద్ధానికి కార‌ణం వెతికి వెతికి అటుపై చేయాలి అన్న‌ది త‌త్వం. కార‌ణం లేకుండా యుద్ధం. త‌ప్పించుకోకుండా చేసే యుద్ధం..కార‌ణం లేకుండా చేసే యుద్ధం మంచిది కాదు. ఒక‌రి త‌ప్పును స‌కాలంలో దండించ‌కుండా ఆయుధ సంప‌త్తి లేద‌న్న నెపంతోనో మ‌రే ఇత‌ర కార‌ణంతోనో త‌ప్పించుకోవ‌డం ఓ త‌ప్పు. యుద్ధం ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి..ఎవ‌రి భారాన్ని త‌గ్గించాలి.. ఎవ‌రి గౌర‌వాన్ని పెంచాలి..అన్న‌వి కీల‌కం.. గోవ‌ర్థ‌న ప‌ర్వ‌తం ఎత్తే వేళ అంద‌రికీ తానే అన్నీ అయ్యాడు. భారాల‌ను మోసే వేళ దేవుడు అని గౌర‌వాన్ని అందుకున్నాడ‌ని వైదికులు అంటారు. భారాన్నే కాదు కృష్ణ‌య్య బాధ్య‌త‌లూ నెర‌వేర్చాడు. స‌ద్గుణ సంప‌న్న‌త‌కు విలువ ఇచ్చాడు. అటువంటి వారికి గౌర‌వం ఇచ్చాడు. గురు భ‌క్తి చాటాడు. గురువు దీవెన పొందాడు. అమ్మ చాటు బిడ్డే కానీ మ‌న్ను తిని లోకాలు చూపి ప‌ర‌మాత్మ త‌త్వానికి తానే ప్ర‌తినిధి అని నిరూపించి లోకాన్ని మురిపించాడు. ముద్దుల కృష్ణుడు..మ‌నుషులు కృష్ణుడు  దేవుడని మురిసిపోవ‌డం క‌న్నా గురువు అని భావించి ఏదో ఒక  మంచి దారి నిర్మాణానికి ఆయ‌న‌కు నాయ‌క‌త్వం వ‌హించ‌మ‌ని ప్రాథేయ‌ప‌డాలి. దారి నిర్మాణం పూర్త‌య్యేంత వ‌ర‌కూ సంక‌ల్పం వ‌దిలిపోకూడ‌ద‌ని ప్రార్థించాలి. క‌ష్టం లోఉంటే సుఖం కోరుకునే శ‌క్తి క‌న్నా ఆదుకునే నైజం ఎవ‌రిలో ఉంద‌న్నది వెతుక్కోవాలి. ఆదుకునే శ‌క్తి ఆదుకునే స్నేహం ఎన్న‌టికీ జీవ‌న్మ‌ర‌ణాల‌ను దాటించేలా ఉంటాయి. మ‌ర‌ణాన్ని జ‌యించే శక్తి స్నేహం, ప్రేమ ఇస్తాయి. క‌నుక భారం త‌గ్గించుకోవ‌డం..భారాన్ని అవ‌స‌రం అయితే మోయ‌డం ఇత‌రుల‌కు సంబంధించి క‌ష్టాన్ని మ‌న క‌ష్టం అని భావించి ప‌రిష్క‌రించ‌డం..త‌ప్పులు దిద్దే క్ర‌మానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం ఇవ‌న్నీ కృష్ణ‌య్యే నేర్పుతాడు.. నేర్చుకోవాలి మీరు నేర్చుకోవాలి నేను..అంద‌రి మేలు కోరి చేసే ప్రార్థ‌న‌లో ఓ గొప్ప శ‌క్తి విశ్వ వ్యాప్తం అవుతుంది.. అది భగ‌వ‌త్ శ‌క్తిని అందిస్తుంది. అతీతం అయిన శ‌క్తి ఇంద్రియాల‌కు అతీతం అయిన శ‌క్తి పొందిన ద‌గ్గ‌ర మ‌నిషి సంక‌ల్పం జ‌యిస్తుంది. అంత‌టి గొప్ప శ‌క్తి ఇత‌రుల‌ను ఆదుకునేందుకు వాడండి. ప్రేమ‌ను ప్ర‌క‌టించి ఊరుకోక జీవితాల‌ను ప‌రిపూర్ణం చేసేందుకు వాడ‌డం నేర్చుకోండి. భారం త‌గ్గించ‌డం బాధ్య‌త. అవును! భారం మోయ‌డం నెర‌వేర్పు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: