తిరుమలలో కొలువైన ఏడుకొండలవాడికి ప్రతిరోజు కొన్ని కిలోల లెక్కన నెయ్యి అవసరమవుతుంది. ఆ నెయ్యిని దేశవాళీ ఆవుల నుంచి సేకరించడానికి నవనీత సేవ పేరుతో నూతన సేవను ప్రవేశపెట్టనున్నారు. అలాగే శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి రోజుకు 30 కిలోల నెయ్యి అవసరమవుతుంది. దీనికి దాదాపు 1200 లీటర్ల పాలు అవసరమవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. ఏడుకొండలను సూచించేలా ఏడురకాల దేశవాళీ ఆవులతోపాటు స్థానికంగా ఉండే మూడురకాల ఆవులతో కలిసి 300 ఆవులను సేకరించనున్నట్లు వెల్లడించారు. అలాగే దేశవాళీ ఆవుల నుంచి తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యిని భక్తుల నుంచి విరాళంగా తీసుకుంటామన్నారు. ఎవరి శక్తిమేరకు వారు నెయ్యిని విరాళంగా ఇవ్వొచ్చని జవహర్‌రెడ్డి తెలిపారు. నెయ్యి కోసం కొందరు భక్తులు 25 గిర్ ఆవులను విరాళంగా ఇచ్చారు. గో సంరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలనుకునేవారిని గో సంరక్షణ ట్రస్ట్‌లో నియమిస్తామని చెప్పారు.తిరుమలలో కొలువైన ఏడుకొండలవాడికి ప్రతిరోజు కొన్ని కిలోల లెక్కన నెయ్యి అవసరమవుతుంది.