శ్రీ రాముడి గొప్పతనం చాటే రామాయణం..

Suma Kallamadi
రావణుడిని సంహరించేందుకు శ్రీరామచంద్రుడుగా, మానవుడిగా, దశరథ మహారాజుకు కుమారునిగా జన్మించిన శ్రీరాముడు మనుషులలో ఉత్తమ గుణాలు కలిగిన గుణవంతుడై, నరుడి మాదిరి అన్ని మానవ భావాలను అనుభవిస్తూ, బంధాలను, అనుబంధాలను అత్యుత్తమంగా పాటిస్తూ, ఓ మంచి కుమారుడిలా ఉంటూ ఓ మంచి సోదరుడిగా మెలుగుతూ.. ఏక పత్నీ వ్రతుడు గా, విశ్వసనీయమైన స్నేహితుడిగా,  ఓ గొప్ప రాజుగా నడుచుకుంటూ ఒక నరుడు జీవితాన్ని అద్భుతంగా అనుభవించారు. భరద్వాజ రామాయణంలో శ్రీరాముడు ఎవరెవరికి ఎలా కనిపిస్తారో భరద్వాజమహర్షి చెప్పుకొచ్చారు. రావణాసురుడికి శ్రీరాముడు మనిషి లాగా కనిపిస్తే మహర్షులకు శ్రీరాముడు భగవంతుడి లాగా కనిపిస్తాడని.. ఆయన తన శ్లోకం ద్వారా చెప్పుకొచ్చారు.

శ్రీరాముడు మానవుడిగా అవతారం ఎత్తడానికి కేవలం రావణాసురుని సంహరించడానికో లేక, దుష్టులైన రాక్షసులను చంపేయడానికో కాదని అంటుంటారు. అసలు ధర్మం అంటే ఏమిటి దానిని ఎలా ఆచరించాలి.. సత్యం అంటే ఏమిటి సత్యాన్ని ఎల్లప్పుడూ ఎలా పలకాలి? వంటి ఎన్నో మహత్తరమైనవి నరులకు బోధించటానికి శ్రీరాముడు మానవుడిలా అవతారం ఎత్తారు. రాజులు తమ ప్రజల కోసం ఎలాంటి రాజ్యపాలన అందించాలనేది చూపించడానికి శ్రీరాముడు తన అద్భుతమైన పాలనతో అందరికీ ఆదర్శంగా పాలన అందించారు. అంతేకాదు సర్వమానవ బంధాలను ఏ విధంగా ఎంత పవిత్రంగా పాటించాలో తాను ఆచరించి మరీ అందరికీ చూపించిన మహనీయుడు శ్రీరామచంద్రుడు.


శ్రీరాముడు నరుడిగా అవతారమెత్తిన సమయం నుంచి  ధర్మాన్ని ఆచరిస్తూ సత్యం పాటిస్తూ సద్గురువుల ఆదేశంతో సత్య మార్గంలో నడిచి దేవుడుగా మారరు. ఒక మానవుడు కూడా దేవుడి లాగా మారాగలడని శ్రీరాముడు ప్రత్యక్షంగా ఆచరించి చూపించారు. అందుకే శ్రీరామచంద్రుడు మనుషులందరికీ అన్ని విధాల ఆదర్శ వంతుడయ్యారు. నరులకు ఏది కష్ట సాధ్యం కాదని ఆయన చేసి చూపించారు. అందుకే ఈ సృష్టి ఉన్నంత వరకు శ్రీ రాముడు సర్వలోక ప్రజలందరికీ ఆదర్శ పురుషుడు అయ్యారు. ప్రతి ఒక్కరూ ఆదరించే శ్రీరాముడు అయ్యారు. అందుకే ఆయన జీవిత విశేషాల సంకలనము రామాయణం గొప్ప గ్రంథం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: