పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయొద్దు...డబ్బును కాలితో తన్నినట్టే...?

VAMSI
ప్రపంచంలోని మనుషులలందరికీ డబ్బు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే డబ్బుకు మానవ జీవితాలు ఎప్పటినుండో ధాషోహమయ్యాయి. ఈ డబ్బుకు మూలం లక్ష్మీదేవి, ఈమె అనుగ్రహాన్ని ఎవరు అయితే పొందుతారో వారికి డబ్బుకు కొదువే ఉండదు. మీరు లక్ష్మి దేవిని ఒక పద్దతిలో పూజిస్తే మీకు సంపద వృద్ధి చెందుతుంది. అలాగే మీ ఇల్లు కూడా శాంతి మరియు ప్రశాంతతతో హాయిగా ఉంటుంది. అందుకే చాలా మంది లక్ష్మి దేవి కి ఇష్టం లేకుండా ఏదైనా పనులు చేస్తే తక్షణమే వారి ఇంటి నుండి వెళుతుందని గట్టిగా నమ్ముతారు. లక్ష్మీ దేవికి ఎంతటి భక్తులయిన ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేస్తుంటారు. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఏ పనులు చేయకూడదో ఒకసారి చూద్దాం.

చాలా మంది గృహిణులు వంటింట్లో పాత్రలను ఎలా పడితే అలా సర్దుకుని ఉంటారు. అంతే కాకుండా కొంతమంది రాత్రి పాత్రలను అలాగే మురికిగా ఉంచి, ఉదయాన్నే కడుగుతుంటారు. ఇలా చేయడం వలన లక్ష్మీ దేవికి ఆగ్రహం కలిగించినవారవుతారు.  ఇంటిలో పనికిరాని వ్యర్ధ పదార్ధాలను మరియు వస్తువులను లేదా ఫైల్స్ ను ఉత్తరం వైపున ఉంచకూడదు. అటువంటి ప్రదేశంలో ఉంచితే లక్ష్మీ దేవికి కోపం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆడవారు అప్పుడప్పుడు మరిచిపోయి ఖాళీ పాత్రలను స్టవ్ మీద ఉంచుతారు..ఈ విధంగా చేయడం మీరు పేదరికానికి దగ్గరవుతున్నారనే సంకేతాన్ని ఇస్తున్నట్లు అర్ధం. అలాగే స్టవ్ ను పరిశుభ్రంగా ఉంచుకోరు. ఇది మీ ఇంట్లో శాంతిని పోగొడుతుంది. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగిస్తుంది.

ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు ఊడ్చకూడదు అలాగే కడగ కూడదు. మరీ సూర్యాస్తమయం తరువాత ఎటువంటి పరిస్థితుల్లో ఇంటిని తుడవడం చేయకూడదు. ఇది మీ దురదృష్టానికి గుర్తుగా చెప్పబడుతున్నది. చీపురుతో లక్ష్మీ దేవి ఉంటుందని నమ్ముతారు. ఈ విధంగా చీపురు ఉపయోగిస్తే కోపం వచ్చి ఇంటిని నుండి వెళ్ళిపోతుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం లక్ష్మీ దేవిని ఆరాధించే వారు విష్ణువును కూడా పూజించాలి. ఎందుకంటే లక్ష్మీ దేవిని ఆరాధించడం వాళ్ళ దయ లభించదు. కాబట్టి లక్ష్మీ నారాయణను ఇద్దరినీ పూజించండి. అప్పుడు మీకు వారిద్దరి ఆశీర్వాదం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: