హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఏడాది టాప్ పొలిటిషన్ ఎవరో తెలుసా..?
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పాలన తర్వాత, విపక్ష నేత జగన్ పైన కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏడాది ఏపీలో అత్యధికంగా సెర్చ్ చేసిన రాజకీయ నేతల జాబితా విషయానికి వస్తే.. ఇందులో ప్రధానంగా చంద్రబాబు ,లోకేష్ ,పవన్ ,జగన్ గురించి జనం ఎక్కువగా సెర్చ్ చేశారు. సీఎంగా ఉన్న చంద్రబాబు, విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ కంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కోసమే ఎక్కువగా గూగుల్ లో చాలామంది యూజర్స్ ఈ ఏడాది(2026) సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ ఏడాది టాప్ లిస్టులో పవన్ కళ్యాణ్ నిలిచారు. ఆ తర్వాత స్థానంలో చంద్రబాబు ఉండగా ఆ తర్వాతి స్థానం జగన్, లోకేష్ ఉన్నారు. ఈ లెక్కను చూసుకుంటే ఈ ఏడాది మాత్రం టాప్ పొలిటిషన్ గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ముఖ్యంగా తన శాఖలకు సంబంధించిన అంశాలతో పాటుగా ,వారాహి డిక్లరేషన్, ఓజి సినిమా, సనాతన ధర్మం గురించి ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ చెబుతోంది. సీఎం చంద్రబాబు విషయానికి వస్తే రాష్ట్ర పాలన కొత్త పెట్టుబడుల విషయాలు ,అమరావతి వంటి అంశాలలోనే సెర్చ్ చేసినట్లు తెలిపింది. ఇక వైయస్ జగన్ విషయానికి వస్తే అటు విపక్ష నేతగా , ప్రభుత్వం పైన విమర్శలు కేసులు వాటి అంశాల పైన ఎక్కువగా సెర్చ్ చేశారు. చివరిగా నారా లోకేష్ ఎంతోమంది ప్రపంచ టెక్ దిగ్గజాలను ఏపీకి తీసుకురావడం, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలలో ఎక్కువగా సెర్చ్ చేశారు.