టాలీవుడ్ 2026 సంక్రాంతి : థియేటర్ల కోసం ఆ ముగ్గురి మధ్య వార్ తప్పదా..?
మైత్రీ మూవీ మేకర్స్: ‘రాజా సాబ్’ ప్రభంజనం :
ఈ సంక్రాంతికి నైజాం ఏరియాలో అత్యంత పట్టున్న మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ ఉంది. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీగా వస్తున్న ఈ సినిమాకు నైజాంలో భారీ ఎత్తున థియేటర్లను కేటాయిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా, సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ వరకు మైత్రీ తన హవాను ప్రదర్శించనుంది.
నైజాం బాక్సాఫీస్ కింగ్ దిల్ రాజు ఈసారి భారీ లైనప్‌తో సిద్ధమయ్యారు. ఆయన మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నైజాం పంపిణీ హక్కులు రాజు సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి చిరంజీవి సినిమా అంటే ఖచ్చితంగా అత్యధిక థియేటర్లు దక్కించుకోవడం ఖాయం. నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగ ఒక రాజు .. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌ను కూడా దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అవకాశం ఉంది. శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారీ సినిమాతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ జననాయగన్ డబ్బింగ్ సినిమాను కూడా దిల్ రాజు నైజాంలో రిలీజ్ చేయబోతున్నారు.
ఏషియన్ సునీల్:
ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కూడా ఈ రేసులో వెనుకబడలేదు. మాస్ మహరాజ్ రవితేజ నటిస్తోన్న
భర్తమహాశయులకు విజ్ఞప్తి సినిమా ఆయన పంపిణీ చేస్తున్నారు. శివకార్తీకేయన్ పరాశక్తి... పవర్ ఫుల్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ సినిమాను కూడా సునీల్ పంపిణీ చేస్తున్నారు.
నైజాం మార్కెట్‌లో దిల్ రాజుకు అత్యధిక థియేటర్ల నెట్‌వర్క్ ఉంది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ ‘రాజా సాబ్’ వంటి భారీ సినిమాతో వస్తుండటంతో థియేటర్ల షేరింగ్ విషయంలో గట్టి పోటీ ఉండబోతోంది. మరోవైపు ఏషియన్ సునీల్ తన మల్టీప్లెక్స్ చైన్ ద్వారా తన సినిమాలకు గరిష్ట స్థాయిలో స్క్రీన్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి 2026 సంక్రాంతి నైజాం ఏరియాలో కేవలం హీరోల మధ్యే కాదు, పంపిణీదారులైన మైత్రీ vs దిల్ రాజు vs ఏషియన్ సునీల్ మధ్య కూడా టఫ్ ఫైట్ ఉండబోతోంది.