సిక్కులు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...?
అదేవిధంగా ఇక్కడ సిక్కు మతస్థులకు గురునానక్ జయంతి అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఇది వారి మొదటి మత గురువైన గురునానక్ గారి పుట్టిన రోజుకు ప్రతీకగా పండుగ లాగా జరుపుకుంటారు. ఈ పండుగను ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులంతా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం నవంబర్ 30వ తేదీన గురునానక్ జయంతిని జరుపుకుంటారు. ఇదే రోజు కార్తీక పౌర్ణమి కావడం మరో విశేషం.
గురుదేవ్ గారి అనుసరించిన ఆధ్యాత్మిక మరియు ఆదర్శవంతమైన మార్గం ఎంతో మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పర్వదినాన ఎంతోమంది సిక్కులు అంకిత భావంతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ గురు ద్వారాలకు హాజరవుతారు. ఒకవేళ అవకాశం లేని వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ పండుగ రోజున అందరికీ భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలంతా ఇందులో ఎటువంటి వర్గ బేధం లేకుండా చేరుతారు. దీనిని ఒక ఐక్యతకు చిహ్నంగా చెప్పుకుంటారు.