ఈ సమయంలో దీపారాధన చేస్తున్నారా...ఇవి తప్పక తెలుసుకోండి....?

VAMSI
కార్తీక మాసం ప్రారంభమయి పది రోజులు గడిచిపోయాయి. భక్తులంతా కరోనాను సైతం లెక్క చేయకుండా శివుని భక్తిలో మునిగి తేలుతున్నారు. ఆలయాలు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. పూర్వ కాలం నుండి వస్తున్న ఆచారాలు, పూజా పద్ధతులు మనమంతా పాటిస్తూ  వస్తున్నాము. అయితే వేదాలలో చెప్పిన విధంగా ఈ కార్తీక మాసంలో ఏ పనిని ఎప్పుడు..ఎలా చేయాలి అనే విషయాలు సంవత్సరం మారుతూ ఉంటాయి. ఎందుకంటే గ్రహాలు రాశుల ప్రభావం వలన ఇవి మారుతూ ఉంటాయి. కార్తీక మాసం అంటే మొదటగా గుర్తొచ్చేది దీపాలు వెలిగించడం. ఈ దీపాలను ఏ సమయంలో వెలిగించాలి మీకు తెలుసా...అయితే ఇంకెందుకు ఆలస్యం కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను చదివేయండి.
దీపం అనేది ఒక నిజం లాంటిది. పాపాన్ని సైతం ప్రక్షాళన చేయగలిగే అంతటి శక్తి కలిగినది. పెద్దలు చెబుతున్నట్లుగా ఏ గృహంలో అయితే దీపం వెలిగించి ఉండదో...ఆ ఇంటిలో జీవం లేదని అర్ధం...అటువంటి వారి ఇంటిలో సిరి నిలువదు. ఎప్పుడూ కష్టాలతో కొట్టు మిట్టాడుతూ ఉంటారు. హిందువులు దీపాన్ని లక్ష్మి దేవితో సమానంగా చూస్తారు. కాబట్టే కార్తీక మాసంలో దీపాలకు అంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ దీపాలను వెలిగించేటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది.
మహిళలు దీపాలు వెలిగించేటప్పుడు సరి అయిన సమయం ఉదయం సూర్యోదయం. కానీ ప్రతి ఒక్కరూ ఈ సమయంలో దీపారాధన చేయడానికి వీలు పడడం లేదు. కాబట్టి మనసులో  పరమ శివుణ్ణి ఆరాధించుకుని ఒక గొప్ప సంకల్పంతో సూర్యోదయం తర్వాత కూడా దీపారాధన చేయొచ్చు. అయితే ఈ సమయం 10 గంటల లోపల మాత్రమే ఉండాలి.  తరువాత సాయంత్రం వేళల్లో 5:30 నుండి 6 గంటలు దాటిన తర్వాత దీపారాధన చేయాలి. ఇలా సూర్యాస్తమయ సమయంలో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: