మహాశివరాత్రి వ్రత కథ తెలుసుకోండి.. పుణ్య గతులు పొందండి

మహాశివరాత్రి వ్రతాన్ని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించాలి. తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుతారు. ఈ వ్రత ప్రాశస్త్యం తెలిపే వ్రత కథ ఉంది. అదేమిటంటే..

“ ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు ఉన్నాడు. అతడు ఒకరోజు అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్న సమయలో అతనికొక తటాకము కనిపించింది. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను.

మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చింది. వ్యాధుడు దానిపై బాణము వేయబోయాడు. లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపొద్దు.. నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరిచాను. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చాడు. నేను గర్భిణిని నన్ను వదలుము. మరొక పెంటి జింక ఇచటికి వచ్చును. దానిని చంపు. నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్లింది.

రెండో జామున మరొక పెంటి జింక కనిపించింది. ఆ జింక కూడా.. ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక వస్తుంది. దానిని చంపు, కానిచో నేనే తిరిగివత్తును" అన్నది. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టాడు. మూడోజామున ఒక మగ జింక అక్కడికి వచ్చింది. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను.

అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా {{RelevantDataTitle}}