మనసుకు మూడే మూడు గుణాలు

మానవ మేధ లేదా మనసు త్రిగుణాత్మకం. ఈ మానసిక తత్వం సాధారణంగా పెరిగిన వాతావరణం, తినే ఆహారం మూడు గుణాల్లో ఏదో ఒక గుణాన్ని సంతరించు కుంటుంది. అసలు హిందూ సమాజములో చేసే వృత్తిని బట్టే ఆహారావలంబన నిర్ణయింప బడుతుందంటారు. తద్వారా నే కులాల విభజన ఏర్పడింది. తినే ఆహారమే ద్వారా మనస్సు గుణం సంతరించుకుంటే తద్వారా వచ్చే వికాస లక్షణమే వృత్తిగా మారితే కాల క్రమేణా వారి వృత్తులే దమాజములో కుల వృత్తులని పిలవబడుతూ కులాల విభజన తో సంఘం ప్రస్తుతమున్న రూపాంతరం చెందింది. మనం తినే ఆహారమే మన స్వభావాన్ని నిర్ణయిస్తుంది.
ప్రతి ఒక్కరి మనస్సు త్రిగుణాల్లో ఏదో ఒకదాన్ని - కొన్ని సందర్భాల్లో ద్వి, త్రి గుణాత్మకత కూడా కలిగి ఉంటుంది.  అవే సత్వ, రజస, తామస గుణాలు.

సత్వగుణం  ప్రశాంతత, నిగ్రహం, స్వచ్ఛత శాంతి వంటి లక్షణాల స్వరూపం కలిగి ఉంటుంది.  

రజో గుణం అభిరుచి మరియు ఆనందం వంటి లక్షణాల స్వరూపం కలిగి ఉంటుంది.  
తామస గుణం ఆగ్రహం, ఉద్వేగం, అహం అహంకారం మరియు వినాశకరం వంటి చెడు లక్షణాల అంటే అరిషడ్వర్గాలతో అంటే కామ క్రోద మద లోభ మొహ మాత్సర్య సమ్మిశ్రితమై ఉంటుంది  స్వరూపం కలిగి ఉంటుంది.  
ఒకరి మనస్సులో దేవుణ్ణి కేంద్రీకరించటానికి రాజస మరియు తామస లక్షణాలు అణచివేయాలి. అప్పుడు సాత్విక లక్షణాలు వ్యాప్తి చెందుతాయి. వివిధ ఆహారాలు మరియు పానీయాలు మనస్సు మీద ప్రభావితం చేయవచ్చు. అందువలన సత్వ, రాజస మరియు తామస స్థాయిలను నియంత్రిస్తాయి. ఉదాహరణకు,మద్యం త్రాగటం వలన కామం వంటి రాజస లక్షణాలు బయటకు వస్తాయి. అదే పద్ధతిలో ఉల్లిపాయలు,వెల్లుల్లి,ఇంగువ మొదలైనవి తినటం వలన కోపం వంటి తామస లక్షణాలు బయట కు వస్తాయి.
దైవ కార్య నిర్వహణ, మత ధరమ నిర్వహణ, తాత్విక చింతననే జీవితంగా మలుచుకున్న వైదిక లేదా వేద పండితులు, సాధువులు లాంటి ధర్మ పరిరక్షకులు తమ దైవ ఆరాధనకు అవరోధంగా తామస,రాజస లక్షణాలను భావిస్తారు. అందువల్ల అటువంటి ఆహారం లేదా పానీయాలను నివారిస్తారు. ఒకరి మనస్సులో రజస, తామస లక్షణాలు ప్రభలంగా ఉంటే వారికీ ప్రశాంతత ఉండదు. అందువలన, శర్వ స్థితి ఉన్న సమయంలో దేవుడి మీద ధ్యానము చేయవచ్చు. ధ్యానం మరియు నమ్మకమైన పూజలు చేసినప్పుడు సత్వ ధర్మ అవలంభన తో సత్వ గుణం వ్యాపించి ఉంటుంది.అందువలన,  వారి అంతరంగమంతా నిరంతరంగా అన్ని రజస,తామస స్వభావాలను అణచివేసి సత్వ భావనను సాత్వక తత్వాన్ని నింపుకుంటారు. వారి పంచేంద్రియా లన్నీ సాత్వికత సంతరించుకొని, రుచితో సహా అన్ని నియంత్రణ తో స్వచ్ఛత సంతరించు కోవటం సహజ ధరమ మౌతుంది. ఈ క్రమం లో మనస్సు స్పటిక మంత స్వచ్చముగా ఉంచబడుతుంది. దైవ అనుగ్రహాన్ని పొందటానికి మనస్సు, వాక్కు, కర్మలు పరిణితి చెంది తద్వారా ప్రసంగం స్వచ్ఛత  ధరించి  దైవకార్య నిర్వహణ సమగ్రత సంపూర్ణత సాధించు కుంటుంది.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: