పెళ్లయి వారం కాకుండానే .. కాపురంలో నిప్పులు పోసుకుంటున్న కొత్తజంట..?

Amruth kumar
అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు వచ్చిన తర్వాత రీసెంట్ గానే అన్నపూర్ణ స్టూడియోలో శోభిత దూళిపాళ‌ను పెళ్లి చేసుకున్నాడు .. ఈ పెళ్లికి కేవలం 300 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు .. తర్వాత తొలిసారిగా ఈ జంట బయట  కనిపించింది.. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కాశ్యప్‌  కుమార్తె ఆలియా కాశ్య‌ప్ వెడ్డింగ్ రిసెప్షన్కు ఈ జంట వెళ్ళింది .. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ వేడుకల్లోనే మీడియా కంట కనిపించారు .. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే శోభితో నాగచైతన్య ఫోటోలు దిగుతారని అంతా అనుకున్నారు .. శోభిత ఫోటోలు దిగటానికి నాగచైతన్యను పిలవగా .. ఆమె ఒక్కదాన్ని వెళ్లి దిగమని చైతు చెప్పాడు .. ఇక దీంతో  ఒక్కసారిగా శోభిత షాక్ అయ్య‌రు తన అసంతృతుని ఫోటోగ్రాఫ్లకు కనిపించకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు .. పెళ్లి జరిగి వారం కాకుండానే ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు చోటు చేసుకుంటేన్నాయ‌ని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు .. ఇక నిజానికి నాగచైతన్య ఎంతో నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడతాడు అలాగే ప్రతి చిన్న విషయానికి ఫోటోలు దిగటం కూడా ఆయనకు ఇష్టం ఉండదు .. నిజానికి పెళ్లి కూడా రెండోది కావడంతో ఆర్భాటం వద్దని తన తండ్రి నాగార్జునకు చెప్పి కేవలం ఎంతో సింపుల్గా అతికొద్దిమంది బంధువులు అతిథుల మధ్య వివాహం చేసుకున్నారు.

అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం నాగచైతన్య కూడా శోభిత పిలవగానే వెళ్లి ఫోటో దిగితే బాగుండేదని , పెళ్లయిన తర్వాత తొలిసారి ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు కాబట్టి కలిసి ఫోటోలు ఎదిగితే ఎంతో బాగుంటుందని అంటున్నారు .. ఏదైనాప్పటికీ పెళ్లయిన కొత్తలోనే భార్య‌ అభిప్రాయాన్ని భర్త భర్త అభిప్రాయాన్ని భార్య గౌరవించాలని వారు చెబుతున్నారు .. అంతేకాకుండా శోభిత చీర కట్టుకొని కనిపిస్తే బాగుండేదని మరికొందరు అంటున్నారు .. వీరిద్దరికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది ..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: