నాగచైతన్య తల్లి రెండో భర్త ఎవరు.. అతని బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా..!

Amruth kumar
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య రీసెంట్ గానే శోభితను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .. అయితే ఇది నాగా చైతన్యకు రెండో పెళ్లి అన్న విషయం అందరికీ తెలిసిందే .. నాగచైతన్య కూడా తన తండ్రి నాగార్జున బాటలో నడిచాడు. నాగార్జున కూడా ముందుగా టాలీవుడ్ లెజెండ్రీ నిర్మాత రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మీ ని పెళ్లి చేసుకున్నారు వీరికి నాగచైతన్య పుట్టిన సమయంలో మనసుపద్దులు రావడంతో నాగార్జున లక్ష్మికి విడాకులు ఇచ్చేశాడు .. తర్వాత నాగార్జున మరో హీరోయిన్ అమలతో ప్రేమలో పడి రెండో పెళ్లి చేసుకున్నాడు .. ఇప్పుడు నాగచైతన్య కూడా తండ్రి బాటలో నడిచి శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు .. అయితే నాగా చైతన్య పెళ్లిలో కుటుంబమంతా హాజరైన కూడా చైతు తల్లి లక్ష్మీ మాత్రం సరిగ్గా ఎక్కడ కనిపించలేదు.

అక్కినేని నాగార్జున - లక్ష్మీ దగ్గుబాటని 1984లో పెళ్లి చేసుకున్నారు .. పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నా ఆ తర్వాత ఇబ్బందులు పడ్డారు .. దీంతో 1990లో వీరు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.. అయితే చైతన్య తల్లి లక్ష్మి నాగార్జున విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారా ? ఆమె భర్త ఎవరు ? ఇప్పుడు ఏం చేస్తున్నారు ? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. నాగచైతన్య స‌వ‌తి తండ్రి శరత్ విజయరాఘవన్ , లక్ష్మీ దగ్గుబాటి , నాగార్జునతో విడాకుల తర్వాత ఇద్దరు వేరువేరు మార్గాల్లో వెళ్లి తమ జీవితాలను కొనసాగించారు.. నాగార్జున హీరోయిన్ అమలను పెళ్లి చేసుకోగా .. లక్ష్మీ దగ్గుపాటి శరత్ విజయ్ రాఘవన్‌ను పెళ్లి చేసుకుంది .అలాగే నాగార్జున , నాగచైతన్య లక్ష్మీ దగ్గుబాటి గురించి అందరికీ తెలిసిందే .. అయితే శరత్ విజయరాఘవనన్‌ గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు.. అయితే ఇప్పుడు నాగచైతన్య తల్లి లక్ష్మి రెండో భర్త గురించి ఇక్కడ తెలుసుకుందాం .. 1992లో నాగార్జున అమ‌లను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత .. లక్ష్మీ దగ్గుబాటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ విజయ రాఘవన్‌ను పెళ్లి చేసుకుంది .. పలు నివేదికల ప్రకారం వీరిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు .. అటు నాగచైతన్య కూడా తన సవతి సోదరులు ఇద్దరితో మంచి రిలేషన్ మెయిన్టైన్ చేస్తూ ఉన్నాడు .

శరత్ విజయరాఘవన్ సుందరం మోటార్స్‌లో కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్. కార్పొరేట్ షేర్‌హోల్డింగ్‌ల ప్రకారం, శరత్ విజయరాఘవన్ ఆస్తుల నికర విలువ వేల కోట్లట. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర డేటా ప్రకారం, కంపెనీ చెక్, శరత్ విజయరాఘవన్ ప్రస్తుతం మూడు కంపెనీలతో సంబంధం కలిగి ఉన్నారు. ఇక చైతు తల్లి లక్ష్మీ దగ్గుబాటి గురించి మాట్లాడుతూ, ఆమె శరత్ విజయరాఘవన్‌తో కలిసి వారి పెళ్లి తర్వాత USA వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయ్యారు. యూఎస్‌లో ఆమె లక్ష్మీ ఇంటీరియర్స్ అనే తన సొంత కంపెనీని కూడా స్టార్ట్ చేశారు.అయితే నాగ చైతన్య తన తల్లి లక్ష్మి దగ్గుబాటికి శరత్ విజయరాఘవన్‌తో రెండవ పెళ్లిని ఇష్టపడలేదని సమాచారం. అయితే పలు నివేదికల ప్రకారం,నాగ చైతన్య తన తల్లి లక్ష్మి కంటే తన తండ్రి నాగార్జునకు చాలా దగ్గరగా ఉంటారని తెలుస్తుంది. వ్యాపారవేత్త శరత్‌తో తన తల్లి రెండవ పెళ్లిని నాగ చైతన్యకు నచ్చలేదు. అందుకే అతను తన తల్లికి దూరమయ్యాడని నివేదికలు పేర్కొన్నాయి. అయితే దీనిపై పలు సందర్భాల్లో మాట్లాడిన చైతు.. అలాంటిదేం లేదన్నారు. తన సినిమాల కోసం... హైదరాబాద్‌లో ఉండవలసి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: