ప్రభాస్ , అల్లు అర్జున్ కాదు .. రెమ్యూనరేషన్ లో ఆ హీరోనే టాప్..!
అయితే మన భారతదేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుల జాబితాలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడని ఆ సదురు కథనం చెప్పుకొచ్చింది .. గత సంవత్సరం పటాన్ , జవాన్ , డంకి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో షారుక్ నటించాడు .. పటాన్ సినిమాతో షారుక్ కు మంచి కం బ్యాక్ ఇచ్చిన సినిమా .. అలాగే ఈ సినిమా కోసం షారుక్ ఖాన్ 55% లాభాల వాటా అంటే సుమారు 350 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అందుకున్నడని ఇలా భారతదేశంలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరో ఇతనే అని ఆ రిపోర్ట్ లో పేర్కొంది .. జవాన్ తన సొంత బ్యానర్ సినిమా కావటంతో నటుడుగా రెమ్యూనరేషన్ తీసుకోలేదు .. కానీ పటాన్ తో వచ్చిన దానికంటే జవాన్ కి ఎక్కువ మొత్తం లాభం వచ్చిందని సదరు కథనం వెల్లడించింది.
వాస్తవానికి మన సౌత్ స్టార్ల్లో దళపతి విజయ్ ది గోట్ మూవీ కోసం 275 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడని ప్రచారం జరిగింది .. అలాగే రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సూపర్ హిట్ సాధించడంతో రెమ్యూనరేషన్ గా లాభాల్లో వాటా కలుపుకుని రజనీకి 200 కోట్లకు పైగా ఇచ్చారని ఆ కథనం చెప్పకు వచ్చింది .. త్రిబుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని వారు ఒక్కో సినిమాకి భారీ మొత్తం పారితోషకాలు వసూలు చేస్తుంటారని ప్రచారం ఉంది. ఇక సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ కూడా లాభాల్లో వాటా కలుపుకుని 200 కోట్లకు వరకు ఉంటుందని, అలాగే అమీర్ ఖాన్ 60% లాభాల వాటాను తీసుకుంటాడని, హృతిక్ రోషన్ కూడా ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడట, అక్షయ్ కుమార్ , అజయ్ దేవగన్ , రన్బీర్ కపూర్ వంటి హీరోలు 80 కోట్ల వరకు అందుకుంటున్నారని ఈ కథనం చెప్పుకొచ్చింది.