కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన బన్నీ లాయర్..ఇంకా చాలంటూ.?

FARMANULLA SHAIK
టాలీవుడ్ స్టార్ హీరో, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారన్న వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈనెల 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందారు. దీనికి అల్లు అర్జున్‌ను బాధ్యుడిగా చేస్తూ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈక్రమంలోనే శుక్రవారం ఉదయం 12గంటల ప్రాంతంలో హీరోని అరెస్ట్ చేసి చిక్కడ్ పల్లి పీఎస్ కు తరలించారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కేటీఆర్ పోస్ట్ లో పేర్కొన్నారు.అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం పూర్తిగా సమ్మతించాల్సిన విషయం కాదని..ప్రభుత్వం ఏదో లాజిక్ ద్వారా అరెస్ట్ చేసిందని విమర్శలు గుప్పించారు. మంచి నటుడ్ని అరెస్ట్ చేయడంపై తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు సేమ్ లాజిక్‌తో ఆలోచిస్తే హైడ్రా అమలు చేస్తున్న సమయంలో ఇద్దరు మరణించారు. దానికి సీఎం రేవంత్ రెడ్డిని బాధ్యుడ్ని చేయాలని తన ఎక్స్ పోస్టులో తెలిపారు.

ఓవైపు బన్నీ అరెస్ట్ ఇండస్ట్రీని కుదిపేస్తుంటే అల్లు అర్జున్ అరెస్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కామెంట్ చేసిన కేటీఆర్ పోస్ట్ పైస్పందిస్తూ కేటీఆర్ కు బన్నీ లాయర్ వార్నింగ్ ఇచ్చారు.చట్టం తన పని తాను చేసుకుపోతున్న క్రమంలో కేటీఆర్ ఈ విషయాన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో, పోస్ట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా బన్నీ లాయర్ రంగంలోకి దిగి, ప్రతి విషయాన్ని రాజకీయ దురుద్దేశంతో చూడడం మానుకోవాలని కేటీఆర్ కు హితవు పలికారు. తమకు రాజకీయ జోక్యం అవసరం లేదని, అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఎటువంటి పొలిటికల్ ఎంటర్ వద్దంటూ న్యాయవాది సూచించారు. ఈ క్రమంలో నిరంజన్ రెడ్డి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగి పోతుంది. ఇదిలావుండగా నిరంజన్ రెడ్డి ఎవరో కాదు లాయర్ తో పాటుగా ఆయన సినీ నిర్మాత కూడా గతంలో వైసీపీ అధినేత, మాజీ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసును నిరంజన్ రెడ్డినే వాదించారు. ఆయన ప్రస్తుతం వైసీపీ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: