2025లో కూడా వరుస ఆఫర్లు.. అక్కినేని ఫ్యామిలీలో 2 సినిమాలకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీలకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ విషయంలో శ్రీలీల టాప్ లో ఉన్నారు. ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. అయితే శ్రీలీలకు వరుస ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. 2025లో కూడా వరుస ఆఫర్లతో శ్రీలీల బిజీగా ఉన్నారు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీలక్రేజ్ మొదలైంది. ధమాకా, గుంటూరు కారం సినిమాలు ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యాయి.
 
పుష్ప ది రూల్ సినిమాలో శ్రీలీల చేసిన కిస్సిక్ సాంగ్ సైతం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. అఖిల్ కు జోడీగా ఒక సినిమాలో చైతన్యకు జోడీగా ఒక సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. వినరో భాగ్యము విష్ణుకథ డైరెక్టర్ డైరెక్షన్ లో అఖిల్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో శ్రీలీల నటించనున్నారు. అఖిల్ శ్రీలీల జోడీ బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
నాగచైతన్య కార్తీక్ దండు కాంబో మూవీలో సైతం శ్రీలీల కనిపించనున్నారని సమాచారం అందుతోంది. సితార బ్యానర్ లో వరుస సినిమాలలో శ్రీలీల నటిస్తుండటం గమనార్హం. అక్కినేని హీరోలకు జోడీగా శ్రీలీల వరుస సినిమాలలో నటిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. శ్రీలీల రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది.
 
2025 సంవత్సరంలో కూడా వరుస ఆఫర్లతో శ్రీలీల కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. శ్రీలీల కెరీర్ పానింగ్ చూసి ఇతర హీరోయిన్లు సైతం ఒకింత షాక్ అవుతున్నారు. శ్రీలీలకు సోషల్ మీడియా వేదికగా సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. శ్రీలీల వరుస విజయాలతో కెరీర్ పరంగా సంచలానాలను సృష్టించాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. శ్రీలీల కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. శ్రీలీల నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: