మరోసారి కోర్టును ఆశ్రయిస్తాం.. ఆసక్తికరమైన విషయాలు చెప్పిన అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీ రాత్రి నుండే ప్రదర్శించారు. ఇకపోతే ఈ మూవీ ప్రీమియర్ షో ను హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ లో కూడా ప్రదర్శించారు.

ఇకపోతే ఈ థియేటర్లో ఈ మూవీ ప్రీమియర్ షో ని చూడడానికి ఈ సినిమాలో హీరో గా నటించిన అల్లు అర్జున్ కూడా విచ్చేశాడు. అల్లు అర్జున్ అక్కడికి రావడంతో పెద్ద మొత్తంలో జనాలు ఆ థియేటర్ వద్ద గుమ్మిగుడారు. దానితో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. దానితో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక నిన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత ఈ రోజు ఉదయం ఆయనను విడుదల చేశారు. విడుదల అనంతరం అల్లు అర్జున్ తరపు ధన్యవాదములు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన కాపీలను జైలు అధికారులకు ముందుగానే తెలియజేశాం.

కానీ వారు అల్లు అర్జున్ ను ఎందుకు విడుదల చేయలేదో తెలియడం లేదని వారు అన్నారు. ఈ విషయంలో మరోసారి న్యాయపరంగా ముందుకు వెళ్తామని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తాజాగా తెలియజేశారు. ఈ విషయమై మరోసారి హైకోర్టు ను సంప్రదించనున్నట్లు అల్లు అర్జున్ న్యాయవాదులు చెప్పుకొచ్చారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ జైల్లో ఉంచుకోవడానికి అస్సలు వీల్లేదని.. కానీ ఉద్దేశ్య పూర్వకంగా ఆయన్ను నిన్న రాత్రంతా జైల్లో ఉంచి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని బన్నీ తరపు న్యాయవాదులు తాజాగా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: