శంభాలా రహస్యాలు

Prasad Bura
హిమాలయాలు భారతదేశానికి పెట్టని కోట. మంచుతో కప్పబడిన పర్వతాలు భారతదేశపు మెడలో సిగలా మారి మెరుస్తూ ఉంటాయి. శత్రువుల బారి నుంచి దేశాన్ని రక్షిస్తూ ఉంటాయి. అలాంటి హిమాలయాల్లో మనకు తెలియన ఎన్నో అంతు చిక్కని రహస్యాలున్నాయ. ప్రపంచంలోని ఏ వ్యక్తి కూడా ఇంతవరకు హిమాలయాలను పూర్తిగా చూడలేదంటే అతిశయోక్తి కాదు. మానవుడు అడుగుపెట్టలేని ఎన్నో ప్రాంతాలు, మనిషి మేధస్సుకు చిక్కని ఎన్నో రహస్యాలు ఆ హిమాయాల్లో ఉన్నాయి.

హిమాలయాల్లో ఎవరూ చూడని ఓ అద్భుత నగరం ఉందని చరిత్ర చెబుతోంది. మన పురాణాల్లో అలాంటి నగరాల గురించి ప్రస్తావన కూడా ఉంది. అదే శంభాలా నగరం. కొన్ని పరిశోధనలు, మరికొన్ని భారతీయ గ్రథాలు, బౌద్ధ గ్రంథాల్లో శంభాల నగరం గురించి ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. బాహ్య ప్రపంచానికి తెలియని లోకం హిమాలయాల్లో ఉందని.. అదే శంభాలా నగరమని అంటారు. దీన్నే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటారు. వేల మైళ్ల విస్తీర్ణమున్న హిమాలయాల్లో మనుషులు చేరుకోలేని చోట ఈ నగరం ఉందని చాలా మంది నమ్ముతారు.

సాక్షాత్తు శివుడు పాలించే నగరం శంభాలా అని.. ఇక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని చెబుతారు. ఇంతటి మహోన్నత నగరం గురించి చాలా మంది పరిశోధకులు తమ జీవితాలను ధారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు. సాక్షాత్తు పరమశివుడు కొలువుండే మౌంట్ కైలాష్ పర్వతాలకు సమీపంలో ఈ పుణ్యభూమి ఉందని చెబుతారు. ఆ ప్రదేశమంతా అద్భుతమైన సువాసనలు వెదజల్లుతూ.. ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారుతుందట.

బౌద్ధ గ్రంథాల్లోని విషయాలను బట్టి శంభాలా చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిత్య సుఖ, సంతోషాలతో ఉంటారట. పాశ్చాత్యులు ఈ ప్రదేశాన్ని ది ఫర్ బిడెన్ ల్యాండ్ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని పిలుస్తారు. లోకంలో పాపం పెరిగిపోయి.. అరాచకతం తాండివిస్తున్న వేళ.. శంభాలాలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని.. అప్పటి నుంచి పుడమిపై కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి.  ఆ కాలంలో 2424లో వస్తుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: