ఏడ్చే మగవానినీ- నవ్వే ఆడదానినీ నమ్మకూడదా?

Durga
పురుషుడు ధీరోదాత్త మనస్కుడు, స్త్రీ కుసుమ కోమల మనస్విని, ఇద్దరినీ వేరువేరు స్వభావమైన మనసులు. ఎంతటి కష్టంలోనూ మగవాడు వెక్కివెక్కి ఏడ్వడు. నాలుగు కన్నీటి బొట్ల కార్చేసి మౌనమైపోతాడు. ఆడది విరుద్దమైన స్వభావురాలు. చిన్న విషయానికే గుండెలు బాదుకుంటుంది. శోకాలు తీస్తుంది. పదిమందినీ పిలుస్తుంది. ఏడుస్తూనే మనసులోని భావాలను మాటల్లో చెబుతుంది. ఇది స్త్రీ తత్వం. మగవాడు ఏడ్వలేడుగాని గట్టిగా పదిమందికి వినిపించే విధంగా నవ్వుతాడు. మళ్ళీమళ్ళీ నవ్వుతాడు. పగలబడీ నవ్వగలడు, వికట్టహాసము చేయగలడు, స్త్రీ నవ్వుతుందిగాని చిరునవ్వు మాత్రమే నవ్వుతుంది. పెద్దపెద్దగా నవ్వదు. కారణమేమంటే స్త్రీలకు సంకోచమెక్కువ. ప్రతి విషయానికీ ఏడ్చేమగవాడినీ, ప్రతి మాటకూ నవ్వే ఆడదానినీ నమ్మరాదని పెద్దలు చెబుతారు. కుటుంబ పరివారానికికంతటికీ ధైర్యం చెప్పవల్సిన మగవాడు అనాథస్త్రీలాగ ఏడుస్తూ కూర్చుంటే సంసారం సాగదు. అందరూ డీలాపడిపోతారు. ఇక ప్రతి విషయానికి ఆడది నవ్వుతూ ఉంటే పరస్త్రీలు పురుషులు తప్పుగా అర్థం చేసుకొంటే మగవాడి జీవితం నవ్వులపాలైపోతుంది గదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: