40 ఏళ్లుగా నిద్ర‌పోని మ‌హిళ‌.. కార‌ణం ఏంటో తెలుసా..?

Paloji Vinay
మ‌నిషికి తిండి, నీరు ఎలా అవ‌స‌రమో నిద్ర కూడా అంతే అవ‌సరం. ఒక్క‌రోజు స‌రిగ్గా నిద్ర‌పోక‌పోయినా ఆరోజు మొత్తం ఏదోలా ఉంటుంది. రోజంతా చిరాకుగా.. నిరుత్సాహంగా మారుతుంది. ప్ర‌స్తుతం చాలామంది నిద్ర లేమితో బాధ‌ప‌డుతున్నారు. మారుతున్న వాతావర‌ణం, జీవన విధానం, సాంకేతిక‌త‌, ప‌ని వేళ‌లు మానవుని శ‌రీరంపై అనేక ర‌కాలుగా ప్ర‌భావం చూపుతున్నాయి. దీంతో రాత్రిళ్లు ఎంత స‌మ‌యం గ‌డిచినా అంత తేలిక‌గా నిద్ర ప‌ట్ట‌దు, కుస్తీ చేయాల్సి ఉంటుంది. అలా అయిన ఎప్పుడో తెల్ల‌వారుజామున నిద్ర ప‌డుతుంది. మ‌న‌కు వ‌చ్చే చాలా అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు స‌రిగ్గా నిద్ర లేక‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం.
  నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు కొంద‌రు వైద్యుల‌ను సంప్ర‌దించి.. చికిత్స తీసుకుంటారు. కానీ అందుకు భిన్నంగా ఓ మ‌హిళ ఏకంగా 40 సంవ‌త్స‌రాలు నిద్ర పోవ‌డం లేదంటా. ఎంత‌గా ప్ర‌య‌త్నించినా  ఆమెకు నిద్ర ప‌ట్ట‌డం లేదు.. స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నా ఉప‌యోగం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది ఆ మ‌హిళ‌.

  ఈ వింత జ‌బ్బు చైనా హెనాన్ ప్రావిన్స్‌లో నివసించే లి జ్యానింగ్‌ అనే మహిళ (45) కు ప‌ట్టుకుంది. గత 40 సంవ‌త్స‌రాలుగా ఇలా నిద్రలేమి సమస్యతో పోరాడుతూ.. ఆమెని ఒక్క సెకను కూడా నిద్రపోనివ్వడం లేదు. జ్యానింగ్‌ 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాగా నిద్రపోయినట్లు గుర్తుందని.. ఆ తర్వాత ఈ వింత వ్యాధి బారిన పడటంతో ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని చెబుతుంది.
 
ఈ విషయాన్ని ఓలి జ్యానింగ్‌ భర్త కూడా ఒప్పుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి ఇప్పటివరకు ఆమె నిద్రపోవడం చూడలేదని అన్నాడు. రాత్రంతా మెలకువగా ఉండటంతో టైం పాస్‌ కోసం ఇంటి పనులు చేయడం, టీవీ చూస్తూ గడుపుతుంద‌ని ఆమె భ‌ర్త తెలిపారు.  ఈ సమస్య నుంచి త‌న భార్యను బయటపడేయడం కోసం జ్యానింగ్‌ భర్త నిద్ర మాత్రలు కూడా వేశాడ‌ట‌. కానీ అవి కూడా ఆమె మీద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. వాటిని వాడటం మానేసిందని తెలుస్తోంది.

ఈ వింత జబ్బు తో తన గ్రామంలో చాలా పాపులర్‌ అయ్యింది లి జ్యానింగ్‌ . ముఖ్యంగా జ్యానింగ్‌ను టెస్ట్‌ చేయడం కోసం చాలా మంది రాత్రి పూట ఆమె ఇంటికి వచ్చి.. పేకాట ఆడుతూ ఉండేవార‌ట‌. అలా ఆడుతూనే వారికి తెలియకుండా నిద్రలోకి జారుకునేవారు. కానీ జ్యానెంగ్‌ మాత్రం అలానే మెలకువగా ఉండేదని చెబుతున్నారు ఆ గ్రామ‌స్తులు. ఈ సమస్య పరిష్కారం కోసం జ్యానెంగ్‌ ఎన్నో ఆస్పత్రులను వెళ్లి.. ఎందరో వైద్యులను కలిసింద‌ట‌, కానీ ఆమె సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు ఇప్ప‌టివ‌ర‌కు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: